Site icon vidhaatha

Hyderabad | హైద‌రాబాద్‌లో దంచి కొడుతున్న వాన‌.. హెల్ప్ లైన్ నంబ‌ర్లు ఇవే..

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రం వ్యాప్తంగా మ‌ళ్లీ వాన దంచికొడుతుంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచి కుండ‌పోత వ‌ర్షం కురుస్తూనే ఉంది. గ‌త మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, ప‌ట్ట‌ణాభివృద్ధి స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ తాజాగా ట్వీట్ చేశారు. వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయినా, చెట్లు నేల‌కొరిగినా, ఇత‌ర స‌మ‌స్య‌లు ఏర్ప‌డినా.. స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ఈ హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌లో సంప్ర‌దించాల‌ని ఆయ‌న న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. హెల్ప్ లైన్ నంబ‌ర్లు – 040 21111111, 90001-13667.

నిన్న కురిసిన భారీ వ‌ర్షానికి న‌గ‌రమంతా జ‌ల‌మ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో ప‌లు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ‌ర్షానికి త‌డుస్తూనే గంట‌ల కొద్ది రోడ్ల‌పైనే ఉండిపోయారు. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేర‌డంతో, విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. ప‌లు చోట్ల చెట్లు నేల‌కొరిగాయి. డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి, చెట్ల‌ను తొల‌గించారు.

Exit mobile version