Site icon vidhaatha

Supreme Court | సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులుగా.. జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌, జ‌స్టిస్ ఎస్వీ భ‌ట్‌

Supreme Court

విధాత‌: సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులుగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్‌భూయాన్‌, జ‌స్టిస్ ఎస్‌. వెంక‌ట‌నారాయ‌ణ భ‌ట్ శుక్ర‌వారం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌తో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. 2011 గువాహ‌టి హైకోర్టు జ‌డ్జిగా ఉజ్జ‌ల్ భూయాన్ బాధ్య‌త‌లు చేపట్టారు.

అనంత‌రం ఆయ‌న తెలంగాణ హైకోర్టులో న్యాయ‌మూర్తిగా ప‌నిచేశారు. త‌ద‌నంత‌రం అదే కోర్టులో జూన్ 28, 2022న తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌తలు చేప‌ట్టారు. ట్యాక్సేష‌న్ లాలో ప్ర‌త్యేక నైపుణ్యం పొందిన ఆయ‌న బాంబే హైకోర్టు న్యాయ‌మూర్తిగా సేవ‌లు అందించి, ట్యాక్సేష‌న్‌తోపాటు విభిన్న రంగాల‌కు సంబంధించిన కేసుల‌ను విచారించారు.

అదేవిధంగా జ‌స్టిస్ వెంక‌ట నారాయ‌ణ భ‌ట్ 2013లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో తొలిసారి న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అనంత‌రం 2019లో ఆయ‌న కేర‌ళ హైకోర్టుకు బ‌దిలీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న 2023 జూన్ నుంచి అదే కోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు జ‌డ్జీల సంఖ్య 34 ఉండాల్సింది 32 మాత్ర‌మే ఉంది. అయితే వీరిద్ద‌రి రాక‌తో ఆ సంఖ్య తిరిగి 34కు చేరింది.

Exit mobile version