Site icon vidhaatha

Rekhachithram OTT: ఓటీటీకి వ‌చ్చేసిన.. సంచ‌ల‌న మ‌ల‌యాళ మిస్ట‌రీ క్రైమ్ థిల్ల‌ర్! డోంట్ మిస్‌

Rekhachithram OTT:

విధాత‌: జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన మ‌ల‌యాళ మిస్ట‌రీ క్రైమ్ థిల్ల‌ర్ రేఖా చిత్రం (Rekhachithram) రెండు నెల‌ల త‌ర్వాత‌ ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. చిన్న చిత్రంగా కేవ‌లం రూ. 6 నుంచి 8 కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కిన ఈ చిత్రం సుమారు రూ.60 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. ఇటీవ‌ల వ‌రుస హిట్ సినిమాల‌తో స్టార్‌గా ఎదుగుతున్న అసిఫ్ అలీ (Asif Ali) క‌థానాయ‌కుడిగా న‌టించ‌గాకేర‌ళ సెన్షేష‌న్ అన‌శ్వ‌ర రాజ‌న్ (Anaswara Rajan), మ‌నోజ్ కే జ‌య‌న్ (Manoj K Jayan) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ వ్య‌క్తి ఆడ‌వి మ‌ధ్య‌లోకి వ‌చ్చి న‌ల‌భై యేండ్ల క్రితం జ‌రిగిన ఓ హ‌త్య‌కు సంబంధించిన చిన్న విష‌యం వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంటాడు. ఆ వివ‌రాలతో అక్క‌డ త‌వ్వ‌కాలు చేయ‌గా ఓ ఆస్త‌పంజ‌రం ల‌భిస్తుంది. ఆపై ఈ కేసు అప్ప‌టికే సస్పెండ్ అయి తిరిగి విధుల్లో చేరిన వివేక్ చేతికి వ‌స్తుంది. దీంతో ఎలాంటి అన‌వాళ్లు, క్లూ లేని మ‌ర్డర్‌ కేసులో ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెట్టిన వివేక్ ఒక్కో విష‌యాన్ని తెలుసుకుంటూ ఇన్వెస్టిగేష‌న్‌ ఓ కొలిక్కి వ‌స్తున్న స‌మ‌యంలో వివేక్‌ను ఆ కేసు నుంచి త‌ప్పిస్తారు. అయినా ప‌ర్స‌ల్‌గా తీసుకున్న వివేక్ సీరియ‌స్‌గా రంగంలోకి దిగుతాడు.

ఈ నేప‌థ్యంలో వివేక్ ఈ కేసును శోధించ గ‌లిగాడా, లేదాఎలాంటి ఆటంకాలు ఎదుర‌య్యాయ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుంది. అస‌లు న‌ల‌భై యేండ్ల క్రితం ఏం జ‌రిగింది. ఆ మ‌ర్డ‌ర్ ఎలా జ‌రిగింది, ఎవ‌రు, ఎందుకు చేశార‌నే విష‌యాలు చాలా ఇంట్రెస్టింగ్ తెర‌కెక్కించారు. ఇప్పుడీ సినిమా సోనీ లివ్ (Sony liv) ఓటీటీ (Ott)లో త‌మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాల్లో ఎలాంటి అస‌భ్య‌త‌, అశ్లీల‌త లేకుండా చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌తో ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా రూపొందించారు. మంచి ఇన్వెస్టిగేష‌న్‌, సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చూడాల‌నుకునే వారు ఈ రేఖా చిత్రం (Rekhachithram) సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో మిస్ అవ్వొద్దు. అయితే సినిమా క‌థ‌నంలో అధిక భాగం మ‌మ్ముట్టి (Mammootty) పాత సినిమాను రీ క్రియేటం చేయ‌డం, మ‌మ్ముట్టి పాత్ర‌ను వాడుకున్న విధానం గొప్ప‌గా ఉంటుంది.

Exit mobile version