Assembly | వరదల పేరుతో ప్రతిపక్షాల బురద రాజకీయం.. అసెంబ్లీలో వాడివేడి చర్చ

Assembly సీఎల్పీ నేత భట్టి, శ్రీధరబాబులపై మంత్రుల ఎదురుదాడి విధాత: వరదలపై చర్చ పేరుతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు చేసిన విమర్శలకు మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డిలు కౌంటర్ ఇచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు వరదలపై మాట్లాడుతు చేసిన విమర్శలకు మంత్రులు తర‌చూ అడ్డుతగులుతూ ఎదురుదాడికి దిగారు. వరద నష్టం అంచనా చెప్పి, 15లక్షల ఎకరాల్లో పంట […]

  • Publish Date - August 4, 2023 / 01:07 AM IST

Assembly

  • సీఎల్పీ నేత భట్టి, శ్రీధరబాబులపై మంత్రుల ఎదురుదాడి

విధాత: వరదలపై చర్చ పేరుతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు చేసిన విమర్శలకు మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డిలు కౌంటర్ ఇచ్చారు.

మంత్రి శ్రీధర్‌బాబు వరదలపై మాట్లాడుతు చేసిన విమర్శలకు మంత్రులు తర‌చూ అడ్డుతగులుతూ ఎదురుదాడికి దిగారు. వరద నష్టం అంచనా చెప్పి, 15లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, వెంటనే పరిహారం అందించాలని, చెక్‌డ్యాంలు శాస్త్రీయంగా లేకపోవడంతో వరద నష్టం అధికమైందన్నారు. ప్రతిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉపద్రవం వచ్చింది కాబట్టి నష్టం జరిగిందని, దానిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లడం తగదన్నారు.

కేటీఆర్ స్పందిస్తు అసలు ప్రభుత్వం ఎలాంటి పంట నష్టపరిహారం అంచనా వేయకుండానే మీరెలా తప్పుడు లెక్కలు చెబుతారంటు శ్రీధర్‌బాబును ప్రశ్నించారు. అసలు మీ నాయకుడు మూడు గంటల విద్యుత్తు చాలన్న వ్యాఖ్యల సంగతేమిటన్నారు. వరదలపై మాట్లాడుతుంటే మధ్యలో చర్చను ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారంటు శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇంతలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కల్పించుకుని ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ ఇచ్చిందని దానిపై మా విధానం స్పష్టంగా ఉందన్నారు. మా పార్టీ నాయకుడు మూడు గంటల విద్యుత్తు చాలనలేదన్నారు. శ్రీధర్‌బాబు వరదలపై చర్చను కొనసాగిస్తుండగానే స్పీకర్ పోచారం మధ్యలోనే ఎంఐఎం సభ్యుడు అక్భరుద్ధిన్‌కు అవకాశం కల్పించారు.

అటు హరీశ్‌రావు చర్చలో జోక్యం చేసుకుని రేవంత్‌రెడ్డి 24గంటల కరెంటు వద్దన్నారని, శ్రీధర్‌బాబు చెక్ డ్యాంలు వద్దంటున్నారని, మరో కాంగ్రెస్ నేత ధరణి వద్దంటున్నారని, ఇదేనా కాంగ్రెస్ విధానం అంటూ ప్రశ్నించారు. భట్టి స్పందిస్తు తమ సభ్యుడు చెక్ డ్యాం వద్ధనలేదని, శాస్త్రీయంగా లేవన్నారని గుర్తు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసిన ప్రాజెక్టులను మీరు రీ ఇంజనీరింగ్ చేశారని, అది అశాస్త్రీయంగా ఉన్నందునే వరద నష్టం పెరిగిందన్నారు.

Latest News