విధాత: ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్ స్టర్ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్( 60), అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వైద్య పరీక్షల కోసం పోలీసులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యూపీలోని ప్రయాగ రాజ్ వద్ద పోలీసుల సమక్షంలోనే కాల్చి చంపారు.
తేరుకున్న పోలీసులు దుండగులపై కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఒక పోలీసుకు గాయాలయ్యాయి. ఈనెల 13న అతిక్ కుమారుడు అసద్‌ను సైతం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి విధితమే. దుమన్ గంజ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించి ఆసుపత్రికి తరలిస్తుండగా వారిని కాల్చి చంపారు.
UP | లైవ్‌లో మర్డర్.. పోలీసులు చూస్తుండగానే కాల్పులు! గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌లు హతం | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/tpKBbIFbxG #UP #YOGI #BREAKINGNEWS pic.twitter.com/cYPvacE5FS
— vidhaathanews (@vidhaathanews) April 16, 2023
కాల్పుల సమయంలో అతిక్ న్యాయవాది విజయ్ కూడా అక్కడే ఉన్నారు. అతిక్, అష్రాఫ్ లను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్న క్రమంలోనే జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి రివాల్వర్లతో వారి తలలోకి కాల్చారు. ఇద్దరు కిందపడిపోగా మరోసారి కాల్పులు జరిపారు. కాల్పుల ఘటనలకు బాధ్యులైన వారిని పోలీసులు వెంటనే ఎదురు కాల్పులకు దిగి పట్టుకున్నారు.
ఈ ఘటనతో రాష్ట్రంలో కొంత ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేశారు. బిఎస్పీ మాజీ ఎంపీ ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుదు అతిక్ పై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతిక్ కు ఐదుగురు కుమారులు. వారిలో అసద్ ఎన్కౌంటర్ కాగా మిగతా నలుగురిలో ఇద్దరు జైలులో, మైనర్లు అయిన మరో ఇద్దరు గృహ నిర్బంధంలో ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే అతిక్, అష్రాఫ్ లను చంపిన తీరుతో యోగి పాలనలో శాంతిభద్రతలు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో అర్థం అవుతుందని అంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు విమర్శించారు.