Site icon vidhaatha

OTT: దేవ‌ర‌తో పోటీ ప‌డి.. ఎట్ట‌కేల‌కు ఓటీటీకి వ‌చ్చేసిన‌ అటిట్యూడ్ స్టార్ రొమాంటిక్ కామెడీ మూవీ

విధాత‌: గ‌త సంవ‌త్సరం దేవ‌ర సినిమాకు పోటీగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ (Ramnagar Bunny). న‌టుడు, ద‌ర్శ‌కుడు ఈటీవీ ప్ర‌భాక‌ర్ (Prabhakar) కుమారుడు అటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న చంద్ర‌హాస్ (Chandrahass) హీరోగా న‌టించాడు. స్వ‌య‌నా తండ్రి ప్ర‌భాక‌ర్ ఈ సినిమాను నిర్మించ‌గా ఆక్టోబ‌ర్‌4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విస్మ‌య శ్రీ (Vismaya Sri), రిచా జోషి (Richa Joshi), అంబికా వాణి (Ambika Vani) హీరోయిన్లుగా న‌టించారు. శ్రీనివాస్ మ‌హాత్ (Srinivas Mahath) ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమా మూడు నెల‌ల త‌ర్వాత డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. బ‌న్నీ రామ్‌న‌గ‌ర్‌లో ఉంటూ స్నేహితుల‌తో గాలి తిరుగుళ్లు తిరుగుతూ ప్రేమ అంటూ అమ్మ‌యిల వెంట ప‌డుతుంటాడు. ఎవ‌రినీ ఎక్కువ కాలం ప్రేమించ‌కుండా త‌రుచూ కొత్త అమ్మాయిల కోసం ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఈక్ర‌మంలో ఓ వివాహిత‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి అమె నిర్వ‌హిస్తున్న ఓ కంపెనీలో జాబ్‌లో చేర‌తాడు. కానీ త‌ను అస‌లు ప్రేమలో ఉన్న‌ది ఓ యువ‌తితో అని గుర్తిస్తాడు తీరా ఆ స‌మ‌యానికి ఆ యువ‌తి ఎంగేజ్‌మెంట్ పిక్స్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ ఏం చేశాడు. త‌ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోగ‌లిగాడా లేదా అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

సుమారు 2.30 గంట‌ల నిడివి ఉండే ఈ సినిమా అక్క‌డ‌క్క‌డ లాగ్ అనిపించినా సినిమా విజువ‌ల్స్‌, పాట‌లు, కాబమెడీ స‌న్నివేశాలు ఆక‌ట్టఉకుంటాయి. ఇప్పుడీ సినిమా ఆహా (aha) లో జ‌న‌వ‌రి 17 శుక్ర‌వారం నుంచి స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అయితే ఒక‌టి రెండు పాట‌ల్లో ముద్దు స‌న్నివేశాలు, రొమాంటిక్ దృశ్యాలు ఉన్నందువ‌ళ్ల ఈ మూవీని పిల్ల‌ల‌తో క‌లిసి చూడ‌లేం. అయితే సినిమా ఓటీటీకి రాక‌ముందే వీడియో సాంగ్స్ రిలీజ్ అయి బాగా వైర‌ల్ అవ‌డంతో వాటిని చూసిన‌వారంతా ఈ రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ (Ramnagar Bunny) మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని చాలా మంది ఎదురు చూశారు. సో.. అలాంటి ప్రేక్ష‌కుల కోసం, థియేట‌ర్‌లో చూడాల‌నుకుని మిస్స‌యిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసేయ‌వ‌చ్చు.

Exit mobile version