Site icon vidhaatha

Helicopter Crash | కూలిపోయిన హెలికాప్ట‌ర్‌.. సైనిక విన్యాసాల నిలుపుద‌ల‌

Helicopter Crash

విధాత‌: ఆస్ట్రేలియా (Australia) లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అమెరికా – ఆస్ట్రేలియా భారీ సైనిక విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విన్యాసాల్లో పాల్గొన్న ఓ హెలికాప్ట‌ర్ ప‌సిఫిక్ స‌ముద్రంలో కూలిపోయింది.

శ‌నివారం జ‌రిగిన ఈ దుర్ఘ‌ట‌న‌లో న‌లుగురు సిబ్బంది గ‌ల్లంతయ్యారని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో సైనిక విన్యాసాల‌ను నిలిపివేశారు. క్వీన్స్‌ల్యాండ్‌లోని హామిల్ట‌న్ ఐలాండ్‌కు ద‌గ్గ‌ర్లో శుక్ర‌వారం అర్ధరాత్రి హెలికాప్ట‌ర్ కూలిపోయింది (Helicopter Crash) అని ఆస్ట్రేలియా ర‌క్ష‌ణ మంత్రి రిచ‌ర్డ్ మర్ల్స్ ప్ర‌క‌టించారు.

కాగా కూలిపోయిన విమానాన్ని ఎంఆర్‌హెచ్ 90 తైపాన్‌గా గుర్తించారు. అయితే గ‌ల్లంతైన వారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. అందులో ప్రయాణిస్తున్న వారంతా ఆస్ట్రేలియ‌న్ పౌరులేన‌ని తెలుస్తోంది.

ఈ ప్ర‌మాదం ఎందుకు జ‌రిగింద‌నేదానిపై అధికారుల‌కు కూడా అంచ‌నా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాలిస్మాన్ సాబ్రేగా పిలిచే ఈ విన్యాసాల్లో ఇరు దేశాల‌కు చెందిన సుమారు 30 వేల మంది సైనికులు పాల్గొంటారు.

Exit mobile version