Site icon vidhaatha

Bachupally | చిన్నారిని చిదిమేసిన స్కూల్ బ‌స్సు.. తండ్రికి స్వ‌ల్ప గాయాలు

Bachupally

విధాత‌: మియాపూర్ ప‌రిధిలోని బాచుప‌ల్లిలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. స్కూటీపై వెళ్తున్న తండ్రీకూతుళ్లు.. ప్ర‌మాద‌వ‌శాత్తు కింద ప‌డ్డారు. దీంతో వారి వెనుకాలే దూసుకొచ్చిన స్కూల్ బ‌స్సు.. చిన్నారి పైనుంచి వేగంగా ముందుకెళ్లింది. బాలిక అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, తండ్రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. కిశోర్ అనే వ్య‌క్తి త‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో బాచుప‌ల్లిలోని ఇందిరా న‌గ‌ర్‌లో నివాస‌ముంటున్నాడు. కుమార్తె దీక్షిత‌(8) బౌరంపేట‌లోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో మూడో త‌ర‌గ‌తి చ‌దువుతుంది. బుధ‌వారం ఉద‌యం దీక్షిత‌ను స్కూల్‌లో విడిచిపెట్టేందుకు తండ్రి త‌న స్కూటీపై బ‌య‌ల్దేరాడు.

దారిపై గుంత‌లు అధికంగా ఉండ‌టంతో.. స్కూటీ స్కిడ్ అయింది. దీంతో తండ్రీకూతుళ్లు కింద‌ప‌డిపోయారు. వెనుకాలే వ‌చ్చిన స్కూల్ బ‌స్సు.. చిన్నారి పైనుంచి దూసుకెళ్లగా, ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. తండ్రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదం జ‌రిగిన తీరును ప‌రిశీలించారు. బాలిక మృత‌దేహాన్ని చూసి కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. కిశోర్‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బ‌స్సు డ్రైవ‌ర్ అతి వేగ‌మే దీక్షిత మృతికి కార‌ణ‌మ‌ని పోలీసులు పేర్కొన్నారు.

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు రోడ్లు గుంత‌ల‌తో అధ్వానంగా త‌యార‌య్యాయ‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ర‌మ్మ‌తులు చేయ‌కుండా సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డమే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ఆరోపిస్తున్నారు.

Exit mobile version