Bengaluru | విధాత: ప్రంచంలో ఆరో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు నిలిచింది. డచ్ లొకేషన్ టెక్నాలజీ నిపుణుడు టామ్ టామ్ 2023 సంవత్సరం ఈ నివేదికను రిలీజ్ చేశారు. 2022లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
గత ఏడాది బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణించేందుకు సగటున 29 నిమిషాల సమయం పట్టింది. 2023లో బెంగళూరులో రద్దీ సమయాల్లో వాహనాల సగటు వేగం గంటకు 18 కిలోమీటర్లు కాగా.. ప్రస్తుతం 28 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతున్నది. ఏడాదిలో బెంగళూరు నగర వాసులు సుమారు 132 గంటల సమయాన్ని ట్రాఫిక్‌లోనే వృథాగా పోయింది.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరంగా లండన్ నిలిచింది. ఈ నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 14 కిలోమీటర్లు. దాంతో పాటు ఐర్లాండ్‌లోని డబ్లిన్ (గంటకు 16 కిలోమీటర్లు) కెనడాలో టొరంటో (గంటకు 18 కిలోమీటర్లు). ఇటలీ మిలన్‌లో (గంటకు 17 కిలోమీటర్లు), పెరూ లిమా (గంటకు 17 కిలోమీటర్లు) తొలి ఐదుస్థానాల్లో నిలిచాయి.
ఈ జాబితాలో మహారాష్ట్రలోని పుణే ఏడో స్థానంలో నిలువగా.. పది కిలోమీటర్ల దూరం ప్రమాణం చేసేందుకు 27 నిమిషాల 50 సెకన్ల సమయం పట్టింది. వాహనాల సగటు వేగం గంటకు 19 కిలోమీటర్లు మాత్రమే. ఆ తర్వాత బుకారెస్ట్, మనీలా, బ్రస్సెల్స్ నగరాలు ఉన్నాయి. ఢిల్లీ 44వ స్థానం నిలువగా.. రద్దీ సమయంలో ఇక్కడ వాహనాల సగటు వేగం గంటకు 24 కిలోమీటర్లుగా రికార్డయ్యింది. ముంబయి నగరం 54వ స్థానంలో నిలిచింది.
గతేడాది సెప్టెంబర్ 27న బెంగళూరులో అత్యధిక ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. ఆ రోజు వాహనాల సగటు వేగం పది కిలోమీటర్లు ప్రయాణించేందుకు ఏకంగా 32 నిమిషాల దాకా సమయం పట్టింది.