విధాత: నవంబర్ నెల ముగిసింది. డిసెంబర్ నెల ప్రారంభమైంది. ప్రతి మాసంలోనే మాదిరిగానే ఈ నెలలో సైతం బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. డిసెంబర్‌లో ఏకంగా 18 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. అధికారిక సెలవులు కాకుండా దేశవ్యాప్త సమ్మె కారణంగా డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనున్నది.
అలాగే బ్యాంకులకు సెలవులు ఆదివారాలు, రెండు, నాల్గో శనివారాలు ఉండనున్నాయి. స్థానిక పండుగల కారణంగా సైతం బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే క్రిస్మస్ తదితర పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అయితే, ఏదైనా అత్యవసర విషయాల్లో బ్యాంకులను సందర్శించాలనుకునే వారు చివరి నిమిషంలో బ్యాంకుకు వెళ్తే మూసి ఉంటే ఇబ్బందులుపడుతుంటారు.
అయితే, అలాంటి వారి కోసం ఆర్‌బీఐ డిసెంబర్ నెలకు సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. అయితే, బ్యాంకులు మూతపడినా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎం సేవలు కొనసాగుతాయి. ఆన్‌లైన్ సేవల ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే ఏటీఎంలు ద్వారా నగదును తీసుకోవడంతో పాటు జమ చేసేందుకు వీలు సైతం ఉన్నది.
డిసెంబర్‌లో బ్యాంక్ సెలవుల లిస్ట్
డిసెంబర్ 1 : రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటానగర్, కోహిమా బ్యాంకులకు హాలీడే
డిసెంబర్ 3 : ఆదివారం సెలవు
డిసెంబర్ 4 : సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ నేపథ్యంలో గోవాలోని పనాజీలో సెలవు
డిసెంబర్ 9 : రెండో శనివారం సెలవు
డిసెంబర్ 10 : ఆదివారం సెలవు
డిసెంబర్ 12 : లాసంగ్-పా టోగాన్ నెంగ్‌మింజా సంగ్మా షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబర్ 13, 14 : లోసంగ్-పా తోగన్ కారణంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు హాలీడే
డిసెంబర్ 17 : ఆదివారం సెలవు
డిసెంబర్ 18 : యు సో సో థామ్ వర్ధంతి కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 19 : గోవా విమోచన దినోత్సవంతో పనాజీలో సెలవు
డిసెంబర్ 23 : నాలుగో శనివారం
డిసెంబర్ 24 : ఆదివారం సెలవు
డిసెంబర్ 25 : క్రిస్మస్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు హాలీడే
డిసెంబర్ 26 : ఐజ్వాల్, కొహిమా, షిల్లాంగ్‌లలో క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 27 : క్రిస్మస్ కారణంగా కోహిమాలోని బ్యాంకులు మూసివేత
డిసెంబర్ 30 : యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు హాలీడే
డిసెంబర్ 31 : ఆదివారం సెలవు.