Supreme Court | అమరావతి రాజధాని పై విచారణ డిసెంబర్‌కు వాయిదా: సుప్రీం

Supreme Court న్యూఢిల్లీ: అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. పూర్తిస్థాయి విచారణ డిసెంబర్లో చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంను కోరగా.. నవంబర్‌ వరకు రాజ్యాంగ ధర్మాసనాల కేసులు ఉన్నాయని తెలిపింది. డిసెంబర్‌లోపు అత్యవసరంగా కేసు విచారణ సాధ్యంకాదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల‌తో కూడిన‌ ధర్మాసనం […]

  • Publish Date - July 11, 2023 / 12:13 PM IST

Supreme Court

న్యూఢిల్లీ: అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. పూర్తిస్థాయి విచారణ డిసెంబర్లో చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంను కోరగా.. నవంబర్‌ వరకు రాజ్యాంగ ధర్మాసనాల కేసులు ఉన్నాయని తెలిపింది.

డిసెంబర్‌లోపు అత్యవసరంగా కేసు విచారణ సాధ్యంకాదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల‌తో కూడిన‌ ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఆదేశాలపై గత విచారణలో సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.

Latest News