Bank Holidays | జూన్‌లో బ్యాంకుల‌కు 12 రోజులు సెల‌వులు..!

Bank Holidays | మే నెల మ‌రో రెండు రోజుల్లో ముగియ‌నుంది. జూన్ నెల గురువారం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో జూన్ నెల‌లో బ్యాంకుల‌కు ఎన్ని రోజులు సెలవులు వ‌స్తున్నాయనే విష‌యం తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం డిజిట‌ల్ చెల్లింపులు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జ‌రిపేవారు, ఇత‌రత్రా ప‌నుల‌పై ప‌లువురు ఖాతాదారులు బ్యాంకుల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి. కాబట్టి బ్యాంకుల‌కు ఏయే రోజుల్లో సెల‌వులు ఉన్నాయో చెక్ చేసుకుంటే మంచిది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జూన్ […]

  • Publish Date - May 29, 2023 / 12:48 PM IST

Bank Holidays | మే నెల మ‌రో రెండు రోజుల్లో ముగియ‌నుంది. జూన్ నెల గురువారం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో జూన్ నెల‌లో బ్యాంకుల‌కు ఎన్ని రోజులు సెలవులు వ‌స్తున్నాయనే విష‌యం తెలుసుకుందాం.

అయితే ప్రస్తుతం డిజిట‌ల్ చెల్లింపులు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జ‌రిపేవారు, ఇత‌రత్రా ప‌నుల‌పై ప‌లువురు ఖాతాదారులు బ్యాంకుల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి. కాబట్టి బ్యాంకుల‌కు ఏయే రోజుల్లో సెల‌వులు ఉన్నాయో చెక్ చేసుకుంటే మంచిది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో జూన్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వాటిల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు రోజులు దేశవ్యాప్తంగా సెలవు. మిగతా ఆరు రోజుల్లో వివిధ కారణాలతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.

జూన్ మాసంలో బ్యాంకుల‌కు సెల‌వులు ఇవే..

జూన్ 4(ఆదివారం) – దేశ‌మంతటా సెల‌వు
జూన్ 10(రెండో శ‌నివారం) – దేశ‌మంతటా సెల‌వు
జూన్ 11(ఆదివారం) – దేశ‌మంతటా సెల‌వు
జూన్ 15(గురువారం) – రాజ‌సంక్రాంతి సంద‌ర్భంగా మిజోరం, ఒడిశాలో సెల‌వు
జూన్ 18(ఆదివారం) – దేశ‌మంతటా సెల‌వు
జూన్ 20(మంగ‌ళ‌వారం) – కంగ్ ర‌థ‌యాత్ర సంద‌ర్భంగా మిజోరం, ఒడిశాలో సెల‌వు
జూన్ 24(నాలుగో శ‌నివారం) – దేశ‌మంతటా సెల‌వు
జూన్ 25(ఆదివారం) – దేశ‌మంతటా సెల‌వు
జూన్ 26(సోమ‌వారం) – త్రిపుర‌లో మాత్ర‌మే సెల‌వు
జూన్ 28(బుధ‌వారం) – ఈద్ ఉల్ అజా సంద‌ర్భంగా కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, జ‌మ్ముక‌శ్మీర్‌లో సెల‌వు
జూన్ 29(గురువారం) – ఈద్ ఉల్ అజా సంద‌ర్భంగా ప‌లు రాష్ట్రాల్లో సెల‌వు
జూన్ 30(శుక్ర‌వారం) – రీమా ఈద్ ఉల్ అజా సంద‌ర్భంగా మిజోరం, ఒడిశాలో సెల‌వు

Latest News