Bhola Shankar: భోళా శంక‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. మాస్ రేంజ్‌లో మెగాస్టార్ ర‌చ్చ‌

Bhola Shankar: వాల్తేరు వీర‌య్య సినిమాతో చివ‌రిగా హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తుంది. గ‌త కొద్ది రోజులుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేస్తుండ‌గా, ఈ మూవీ విడుదల తేది […]

  • Publish Date - July 27, 2023 / 10:58 AM IST

Bhola Shankar: వాల్తేరు వీర‌య్య సినిమాతో చివ‌రిగా హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తుంది. గ‌త కొద్ది రోజులుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేస్తుండ‌గా, ఈ మూవీ విడుదల తేది దగ్గరపడుతున్న నేప‌థ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్ర ట్రైల‌ర్‌ని రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయించడం విశేషం.

ట్రైల‌ర్ అభిమానుల‌కి పూనకాలు తెప్పిస్తుంది. హౌరా బ్రిడ్జి దగ్గర ఇంకో అమ్మాయి మిస్సింగ్ అంట సార్.. అంటూ సాగే సంభాషణలతో చిత్ర ట్రైల‌ర్ మొద‌లు కాగా, పబ్లిక్‌కు ప్రాబ్లమ్ వస్తే పోలీసుల దగ్గరకు పోతరు…అదే పోలీసులకు ప్రాబ్లమ్ వస్తే భోళాభాయ్‌ దగ్గరకు వస్తారు. నీ వెనక మాఫియా ఉంటే.. నా వెనుక దునియా ఉంది బే.. అంటూ చిరంజీవి చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాయి. మెగా అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌ మెంట్ చిత్రంలో ఉండ‌నుంద‌ని ట్రైల‌ర్ తో అర్ధ‌మ‌వుతుంది. ఇందులో మెగాస్టార్ తనదైన స్వాగ్ అండ్ సాలిడ్ యాక్షన్ తో అయితే అదరగొట్టగా వీటితో పాటుగా మంచి కామెడీ కూడా కనిపిస్తుంది. ఓ బిట్ లో చిరు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం విశేషం. ఇక ఈ చిత్రంలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమాకి సంబంధించిన పాట‌లు ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తుండ‌గా, వాటికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మూవీలో చిరంజీవి క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. గ‌తంలో గ్యాంగ్ లీడర్, ఇంద్ర తదితర సినిమాల్లో క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించిన చిరంజీవి.ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమాలో అదే తరహా పాత్రలో క‌నిపిస్తుండ‌డంతో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, కే.యస్. రామారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి ఖాతాలో మ‌రో హిట్ గా నిలుస్తుంద‌ని అంటున్నారు.

Latest News