Lord Shiva | హిందువులు సోమవారం శివయ్యను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భక్తులు ఏది అడిగినా ఇచ్చేవాడు శివుడు. అందరి పట్ల దయ హృదయంతో మెలుగుతాడు ఆ పరమేశ్వరుడు. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటిస్తారు. సోమవారం నాడు శివుడిని పూజించి, ఉపవాసం ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సోమవారం తెల్లవారుజామునే మేల్కొని, తలస్నానం ఆచరించాలి. అనంతరం శివాలయానికి వెళ్లి శివలింగానికి నీళ్లు, పాలు సమర్పించాలి. ఆ తర్వాత ఉపవాస దీక్షలో నిమగ్నం కావాలి. మరి ఉపవాస నియమాలు ఏంటో తెలుసుకుందాం..
ఉపవాసన నియమాలు ఇవే..
1. సోమవారం తప్పనిసరిగా శివుడిని, పార్వతిని పూజించాలి.
2. భోళాశంకరుడికి నీరు, పాలు, బిల్వ పత్రం, పువ్వులు మొదలైన వాటిని సమర్పించాలి. అనంతరం హారతినివ్వాలి.
3. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఉపవాస దీక్ష చేపట్టాలి.
4. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండొచ్చు.
5. ఉపవాసం సమయంలో పండ్లు తినకూడదు అనే ప్రత్యేక నియమం లేదు.
6. మూడు గంట తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయాలి.
7. వీలైతే మళ్లీ సాయంత్రం వేళ ఒకసారి శివయ్యకు పూజ చేసి హారతిని ఇవ్వాలి.