Site icon vidhaatha

Mahesh Babu | మెహ‌ర్ ర‌మేష్ వ‌లలో ఇరుక్కున్న చిరు.. తెలివిగా ఎస్కేప్ అయిన మ‌హేష్ బాబు

Mahesh Babu |

మెహ‌ర్ ర‌మేష్‌.. ఈ ద‌ర్శ‌కుడి పేరు చాలా త‌క్కువ మందికి తెలిసి ఉంటుంది. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన కూడా పెద్దగా విజ‌యాలు అందుకోలేదు. కెరీర్‌లో ఒకటో రెండో యావ‌రేజ్ విజ‌యాలు అందుకున్నారు. ఇటీవల ఆయన డైరెక్ష‌న్ చేసింది లేదు. దాదాపు ప‌దేళ్ల‌ పాటు డైరెక్ష‌న్‌కి దూరంగా ఉన్న మెహ‌ర్ ర‌మేష్‌కి మెగాస్టార్ చిరంజీవి గొప్ప ఛాన్స్ ఇచ్చాడు.

త‌న‌తో సినిమా చేసే అవ‌కాశం ఇవ్వ‌డంతో త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం వేదాళంని తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు నేటివిటికి అనుగుణంగా ప‌లు మార్పులు చేసి చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 11న విడుద‌ల కాగా, తొలి ఆట నుంచి మూవీకి నెగెటివ్ టాక్ వ‌చ్చింది. సినిమా రివ్యూలు దారుణంగా వ‌చ్చాయి. క‌లెక్ష‌న్స్ కూడా డ్రాప్ అయ్యాయి. సోమ‌వారం నుంచి భోళా శంక‌ర్ చిత్రం థియేట‌ర్స్‌లో క‌నిపించ‌ద‌నే టాక్ వినిపిస్తుంది.

అయితే ‘భోళాశంకర్‌’ సినిమాని సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు జస్ట్ లో మిస్ అయ్యాడని, కానీ మెగాస్టార్‌ మాత్రం దానికి బలయ్యాడంటూ ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ద‌ర్శకుడు మెహెర్‌ రమేష్.. మొదట ‘వేదాళం’ సినిమా రీమేక్‌ స్క్రిప్ట్ ని మ‌హేష్ బాబు ద‌గ్గ‌ర తీసుకెళ్లార‌ట‌.

నెల రోజుల పాటు మ‌హేష్ బాబు వెంట తిరిగిన కూడా ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డంతో అదే స్క్రిప్ట్‌తో చిరంజీవిని క‌లిసారు. ఇది రీమేక్ మూవీ కావ‌డం, అందులోను అది త‌మిళంలో పెద్ద హిట్ కావ‌డంతో ఓకే అన్నార‌ట‌. మెహ‌ర్ చెప్పిన స్టోరీలో సిస్టర్‌ సెంటిమెంట్‌, ఉమెన్‌ ట్రాఫికింగ్‌, యాక్షన్‌ సీన్లు ఉండటంతో కమర్షియల్‌గా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని చిరంజీవి భావించారు.

మెహ‌ర్ ర‌మేష్.. చిరంజీవిని చూస్తూ పెరిగారు. ఈ క్రమంలో త‌ను చెప్పిన క‌థ‌తో సినిమాని అద్భుతంగా చూపిస్తాడ‌ని అనుకున్నారు. కానీ 20 సంవ‌త్స‌రాల వెన‌క్కి తీసుకెళ్లి ప్రేక్ష‌కుల‌కి విసుగు తెప్పించాడు. చిత్రం దారుణ‌మైన ఫ్లాప్ కావ‌డంతో చిత్ర బృందం నుంచి ఒక్క‌రు కూడా దీనిపై నోరు తెర‌వ‌డం లేదు. మొత్తంగా చూస్తే మహేష్‌ చేయాల్సిన సినిమాని చిరంజీవి చేసి బ‌ల‌య్యారు.

సూప‌ర్ స్టార్ మహేష్‌బాబు మాత్రం తెలివిగా త‌ప్పించుకున్నారు. భోళా శంక‌ర్ చిత్రంలో త‌మ‌న్నా, కీర్తి సురేష్‌, శ్రీముఖి, రష్మి, హైపర్‌ ఆది, వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం, గెటప్‌ శ్రీను, నరేష్‌, బిత్తిరి సత్తి, ఉత్తేజ్‌, బ్రహ్మాజీ, రవిశంకర్‌ వంటి వారు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే.

Exit mobile version