విధాత: చిరుత పులి పేరు వినగానే మన శరీరంలో వణుకు పుడుతోంది. అది కూడా ఓ నల్ల చిరుత పులి జింకపై దాడి చేసి చంపేసింది. మరి అలాంటి వీడియోను చూస్తే తప్పకుండా మన శరీరం వణికిపోవాల్సిందే. జింక మెడను నోటితో అదిమిపట్టిన నల్ల చిరుత.. ఫోటోగ్రాఫర్ల శబ్దం విని పారిపోయింది. మరో చిరుత వచ్చి జింకను లాక్కెళ్లింది.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే రాత్రి సమయాల్లో అడవి జంతువులను ఇలా క్యాప్చర్ చేయడానికి ఎవరు హక్కులు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ వీడియోను 31 వేల మంది వీక్షించగా, 1200 మంది లైక్ చేశారు.