Site icon vidhaatha

Brahmanandam 2nd Son Marriage | అట్ట‌హాసంగా బ్ర‌హ్మానందం త‌న‌యుడి వివాహం..కేసీఆర్ స‌హా పలు ప్ర‌ముఖులు హాజ‌రు

Brahmanandam 2nd Son Marriage |

లెజండ‌రీ క‌మెడీయ‌న్, హాస్య బ్ర‌హ్మా బ్ర‌హ్మానందం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. త‌న రెండో త‌న‌యుడి వివాహాన్ని అట్ట‌హాసంగా జరిపించారు బ్ర‌హ్మ. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కుల రాక‌తో వేడుక సంద‌డిగా మారింది. బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు అయిన సిద్ధార్థ.. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో మూడు ముళ్లు వేసి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

పెళ్లి వేడుక‌కి వ‌చ్చిన ప్ర‌ముఖులు అంద‌రు కూడా నూత‌న జంట‌కి త‌మ ఆశీర్వ‌చనాలు అందించి నిండు నూరేళ్లు సుఖ సంతోషాల‌తో జీవించాలని ఆశీర్వ‌దించారు. సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటల స‌మ‌యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు ఉన్న‌ అన్వయ కన్వెన్షన్స్ లో అట్ట‌హాసంగా జరిగింది.

సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహ వేడుక‌కి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజ‌రై సంద‌డి చేశారు.

ఇక సినిమా ప‌రిశ్ర‌మ నుండి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులతొ పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ కూడా హాజ‌ర‌య్యారు.

వారితో పాటు సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులకి త‌మ ఆశీర్వ‌చ‌నాలు అందించారు.

పెద్ద కొడుకు గౌతమ్‌ తెలుగు సినిమాల్లో హీరోగా నటించి అల‌రించ‌గా, చిన్న కుమారుడు సిద్ధార్థ్ మాత్రం విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఆయ‌న‌కు యాక్టింగ్ అంటే ఇష్టం లేక‌పోవ‌డంతో ఇండ‌స్ట్రీవైపు రాలేదు.

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కమెడియన్‌గా నటుడిగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న బ్రహ్మానందం తన ఇద్ద‌రు కుమారులను సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. ఈ విషయంలో బ్ర‌హ్మీ అభిమానులు ఒకింత నిరాశ చెందుతుంటారు.

Exit mobile version