Site icon vidhaatha

Minister Jagdish Reddy | గిరి ‘జనం’కు.. గులాబీ అండ: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: గులాబీ జెండా నీడలో మౌలిక వసతులు కల్పనతో గిరిజన తండాలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం బడితండాలో గిరిజనులు అత్యంత ప్రాశస్త్యంగా కొలుచుకునే చాంపూలాల్ జాతరను గిరిజనుల సాంప్రదాయాన్ని అనుసరించి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ఆచారం ప్రకారం డప్పులు మ్రోగించి ప్రారంభించారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తండాలకు పంచాయతీ హోదా కట్టబెట్టి కోట్లాది రూపాయలతో గిరిజన అవాసాలను అభివృద్ధి పరచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన కొనియాడారు. తండాల అభివృద్ధి 2014 కు ముందు 2014 కు తరువాత అన్నది ఒక్కసారి పరికించి చుస్తే జరిగిన పురోగతి ఇట్టే బోధ పడుతుందన్నారు.

అంతర్గత రహదారులతో గిరిజన తండాలు కళకళ లాడుతున్నాయని అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతయే కారణమన్నారు. మిషన్ భగీరథ తో గిరిజన తండాలలో మంచి నీటి ఎద్దడిని నివారించిన ప్రభుత్వం గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మునుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరింత మెరుగైన పాలన దిశగా గిరిజనులు తమ తోడ్పాటునందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గులాబీ జెండా నీడన యావత్ గిరిజన సమాజం మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు గిరిజనుల ఆరాధ్య దైవం చాంపూ లాల్ ఆశీస్సులు బలంగా ఉండాలని ప్రార్దించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

Exit mobile version