పనులు చేపట్టాలని పూలతో నిరసన

  • Publish Date - April 12, 2024 / 08:11 PM IST

నర్సంపేటలో బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం

విధాత, వరంగల్ ప్రతినిధి: గత ప్రభుత్వ హయంలో మంజూరైన అభివృద్ధి పనులను ప్రారంభించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతంలో శుక్రవారం పూలుచల్లి నిరసన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఈ పనులు ప్రారంభించాలని కోరారు. ఎన్నికల నిబంధల నేపథ్యంలో శాంతియుతంగా ఈ నిరసన కొనసాగించారు. నియోజకవర్గంలో జీవో నెంబర్ 447 అనుసరించి సీఆర్ఆర్ గ్రాంట్ ద్వారా రూ.23 కోట్ల నిధులతో 18 రోడ్లు మంజూరయ్యాయని, జీవో 396 ప్రకారం రూ. 40 కోట్ల 13 లక్షలు నిధులతో 13 రోడ్లతో పాటు 3 బ్రిడ్జిలు మంజూరయ్యాయని పేర్కొన్నారు జీవో నెంబర్ 260 అనుసరించి 36 కోట్ల 56 లక్షల రూపాయల నిధులతో 25 బీటీ రోడ్లు మంజురయ్యాయని, జీవో నెంబర్ 242 అనుసరించి 37 కోట్ల 42 లక్షల రూపాయలతో 24 బీటీ రోడ్లు మంజూరయ్యాయని వీటిని చేపట్టాలని కోరారు. మంజూరుతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తై, అగ్రిమెంట్లు ముగిసినందున పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితో పాటు ఇరిగేషన్ శాఖలో కూడా పనులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే స్పందించి నియోజకవర్గ అభివృద్దికి చర్యలు చేపట్టాలన్నారు.

Latest News