Site icon vidhaatha

BRS MLC | ప్రమాణ స్వీకారం చేసిన.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు

విధాత‌: హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా (MLC) ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, చల్లా వెంకట్రాంరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

శుక్రవారం ఉదయం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో నూతన ఎమ్మెల్సలీలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు.

Exit mobile version