Site icon vidhaatha

MLC Elections | నామినేష‌న్లు దాఖ‌లు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు

విధాత‌: MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) రెండు రోజుల క్రితం పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముగ్గురు అభ్య‌ర్థులు దేశ‌ప‌తి శ్రీనివాస్(Desapathi Srinivas), న‌వీన్ కుమార్ (Naveen Kumar), చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి (Challa Venkatramireddy) త‌మ నామినేష‌న్ల‌ను అసెంబ్లీ సెక్ర‌ట‌రీ న‌ర‌సింహాచార్యుల‌కు గురువారం ఉద‌యం ప‌రిశీలించారు.

అంతకు ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గ‌న్ పార్కులో అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా దేశ‌ప‌తి శ్రీనివాస్ అమ‌ర‌వీరుల‌కు పాట రూపంలో నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, భీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, మాధ‌వ‌రం కృష్ణారావు, కేపీ వివేకానంద‌, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Exit mobile version