Punjab | పాక్ చొర‌బాటుదారుడి కాల్చివేత‌

77వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ‌ పఠాన్‌కోట్ స‌రిహ‌ద్దులో అగంత‌కుడి దుశ్చ‌ర్య‌ కాల్చిచంపిన భద్రతా దళాలు Punjab | విధాత‌: పాకిస్తాన్ చొర‌బాటుదారుడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కాల్చి చంపాయి. ప‌ఠాన్‌కోట్ స‌రిహ‌ద్దులో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో చొర‌బాటు ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. 'పంజాబ్ రాష్ట్రం పఠాన్‌కోట్ (Pathankot) జిల్లా అంత‌ర్జాతీయ సరిహద్దులోని సింబల్ సకోల్ గ్రామ‌ సమీపంలో సరిహద్దు ఫెన్సింగ్ ద‌గ్గ‌ర ఆదివారం అర్ధ‌రాత్రి దాటాక పాకిస్థాన్ […]

  • Publish Date - August 14, 2023 / 08:52 AM IST

  • 77వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ‌
  • పఠాన్‌కోట్ స‌రిహ‌ద్దులో అగంత‌కుడి దుశ్చ‌ర్య‌
  • కాల్చిచంపిన భద్రతా దళాలు

Punjab | విధాత‌: పాకిస్తాన్ చొర‌బాటుదారుడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కాల్చి చంపాయి. ప‌ఠాన్‌కోట్ స‌రిహ‌ద్దులో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో చొర‌బాటు ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది.

‘పంజాబ్ రాష్ట్రం పఠాన్‌కోట్ (Pathankot) జిల్లా అంత‌ర్జాతీయ సరిహద్దులోని సింబల్ సకోల్ గ్రామ‌ సమీపంలో సరిహద్దు ఫెన్సింగ్ ద‌గ్గ‌ర ఆదివారం అర్ధ‌రాత్రి దాటాక పాకిస్థాన్ చొరబాటుదారుడి అనుమానాస్పద కదలికను సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది గమనించారు. భ‌ద్ర‌తా సిబ్బంది హెచ్చ‌రించినా, అతడు ఆగ‌లేదు. సరిహద్దు ఫెన్సింగ్ వైపు ముందుకు న‌డిచాడు. చొరబాటుదారుడిని అడ్డుకునేందుకు జ‌రిపిన కాల్పుల్లో అగంత‌కుడు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు’ అని బీఎస్ఎఫ్ పంజాబ్‌ పీఆర్‌వో తెలిపారు.

Latest News