- రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త దోపిడీకి ప్రయత్నం..
విధాత: రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఏప్రిల్ నెల నుంచి అదనంగా విద్యుత్ చార్జీలు(Electricity charges)పెంచి పేద ప్రజలపై పదివేల కోట్లు భారం పడే విధంగా కుట్రలు చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్(Chandra Shekar) ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ కన్వెన్షన్ కమీషన్(Additional Convention Commission)పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని వేయబోతుందని ప్రజలు దీన్ని గమనించాలన్నారు. గతంలో విద్యుత్తు అధికంగా వినియోగించిన వారిపై అడిషనల్ కన్వెన్షన్ డిపాజిట్ పేరుతో డబ్బులు కట్టించుకునే వారని, దాని ద్వారా వినియోగదారుడు కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్(ఏసిసి) చేసుకున్నప్పుడు డిపాజిట్ అమౌంటు తిరిగి వచ్చేదని అన్నారు. ప్రస్తుతం అడిషనల్ కన్వెన్షన్ కమీషన్ పేరుతో వసూలు చేసే చార్జీలు కరెంటు వినియోగదారునికి తిరిగి రావన్నారు. దానివల్ల పేద ప్రజలకు అదనంగా 1000 నుంచి 2000 రూపాయలు భారం పడుతుందన్నారు. కావున వెంటనే ప్రభుత్వం ఏసిసినీ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
హైదరాబాదులోని పాతబస్తీ లాంటి చోట్ల, మరికొన్ని ప్రభుత్వ సంస్థలలో పెండింగ్ లో ఉన్న బిల్లులను వసూలు చేయలేక, నిజాయితీగా కడుతున్న పేద ప్రజల నుంచి వసూలు చేసే ప్రయత్నమే విద్యుత్ ఛార్జీల పెంపు అని ఆయన విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధ్యక్షుడు పాండురంగారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు న్యాయవాది ఎన్.పి వెంకటేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అచ్చిగట్ల అంజయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.