Kejriwal | ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో 56 ప్ర‌శ్న‌లు అడిగారు.. ఈ కేసు క‌ల్పితం : అర‌వింద్ కేజ్రీవాల్

Kejriwal | ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు త‌న‌ను 56 ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్లు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాకు వెల్ల‌డించారు. సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను 9 గంట‌ల పాటు విచారించిన సంగ‌తి తెలిసిందే. సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి నేరుగా త‌న కాన్వాయ్‌లో ఇంటికి చేరుకున్న అనంత‌రం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ అధికారుల విచార‌ణ గౌర‌వంగానే కొన‌సాగింది. త‌న‌ను 56 ప్ర‌శ్న‌లు అడిగారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాలు.. […]

  • Publish Date - April 17, 2023 / 06:55 AM IST

Kejriwal | ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు త‌న‌ను 56 ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్లు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాకు వెల్ల‌డించారు. సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను 9 గంట‌ల పాటు విచారించిన సంగ‌తి తెలిసిందే. సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి నేరుగా త‌న కాన్వాయ్‌లో ఇంటికి చేరుకున్న అనంత‌రం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ అధికారుల విచార‌ణ గౌర‌వంగానే కొన‌సాగింది. త‌న‌ను 56 ప్ర‌శ్న‌లు అడిగారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాలు.. ఈ కేసు పూర్తిగా క‌ల్పితం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఢిల్లీలో నూత‌న మ‌ద్యం విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన 2020 నాటి నుంచి అన్ని వివ‌రాల‌పై సీబీఐ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఈ కేసు వివ‌రాల‌ను రేపు నిర్వ‌హించ‌బోయే ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశంలో మాట్లాడుతాన‌ని అర‌వింద్ కేజ్రీవాల్ స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసు పూర్తిగా అవాస్త‌వం. ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంత‌మే నిజాయితీ అని స్ప‌ష్టం చేశారు. చావ‌నైనా చ‌స్తాం గానీ.. నిజాయితీలో రాజీప‌డ‌బోం అని తేల్చిచెప్పారు కేజ్రీవాల్. ఆప్ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వ‌లేక‌నే త‌మ‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నార‌ని, ఈ క్ర‌మంలో వ‌చ్చిన కేసే ఇది అని పేర్కొన్నారు. ఆప్ జాతీయ పార్టీగా అవ‌త‌రించింది… దీన్ని అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నార‌ని కేజ్రీవాల్ తెలిపారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియాను ఇప్ప‌టికే అరెస్టు చేసిన విష‌యం విదిత‌మే.

ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సీబీఐ విచార‌ణ ఆదివారం రాత్రి ముగిసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు తొమ్మిది గంట‌ల పాటు కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యానికి కేజ్రీవాల్ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాత్రి విచార‌ణ ముగిసిన అనంత‌రం సీబీఐ ఆఫీసు నుంచి నేరుగా త‌న ఇంటికి కాన్వాయ్‌లో వెళ్లారు కేజ్రీవాల్. సీబీఐ ప్ర‌ధాన కార్యాలయం వ‌ద్ద‌కు చేరుకున్న ఆప్ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కేజ్రీవాల్ అభివాదం చేశారు.

Latest News