Site icon vidhaatha

మళ్లీ వాయిదాల్లో బాబు కేసులు

విధాత: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోరుతు చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం 2.15గంటలకు వాదనలు వింటామని జడ్జీ తెలిపారు. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ కొనసాగింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.


అటు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ కూడా బుధవారానికి వాయిదా పడింది. బెయిల్‌పై ఇవాళే వాదనలు వినాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోరగా, ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని చెప్పిన జడ్జీ తాను రేపటి నుంచి సెలవుపై వెలుతున్నట్లుగా తెలిపారు. బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో ఇంచార్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వ్యవహరించారు.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా బుధవారమే విచారణకు రానుంది. చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మోమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ నేడు విచారణకు అంగీకరించారు. మంగళవారం ధర్మాసనం విచారణ ఉండటంతో బాబు పిటిషన్ విచారణ బుధవారం చేపట్టాలని సీజేఐ నిర్ణయించారు.

Exit mobile version