Chattisgarh | రిటైర్మెంట్.. ఆ వెంట‌నే అపాయింట్.. అయోమ‌యంలో సీనియ‌ర్ ఐపీఎస్‌

Chattisgarh విధాత ప్రతినిధి: సాధారణ పౌరుల జీవితాల్లో అప్పుడప్పుడు వింతలు-విడ్డూరాలు జరుగుతూనే వుంటాయి. కాని ప్రభుత్వ ఉన్నత పదవుల్లో ఉన్న వారి జీవితాల్లో కూడా వింతలు-విడ్డూరాలు జరుగుతాయంటే నమ్మశక్యం కాదు. అదృష్టమో, దురదృష్టమో అర్ధం కాని అయోమయ పరిస్థితి అది ఎదుర్కొన్నవారికే తెలుస్తుంది. అటువంటిదే ఒక ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగింది. 1988 ఐ.పి.ఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ పిళ్ళై జైళ్ళ పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వ‌హిస్తూ గ‌త సోమ‌వారం రిటైర్ అయ్యారు. ఆయన […]

  • Publish Date - August 4, 2023 / 02:18 PM IST

Chattisgarh

విధాత ప్రతినిధి: సాధారణ పౌరుల జీవితాల్లో అప్పుడప్పుడు వింతలు-విడ్డూరాలు జరుగుతూనే వుంటాయి. కాని ప్రభుత్వ ఉన్నత పదవుల్లో ఉన్న వారి జీవితాల్లో కూడా వింతలు-విడ్డూరాలు జరుగుతాయంటే నమ్మశక్యం కాదు. అదృష్టమో, దురదృష్టమో అర్ధం కాని అయోమయ పరిస్థితి అది ఎదుర్కొన్నవారికే తెలుస్తుంది. అటువంటిదే ఒక ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగింది.

1988 ఐ.పి.ఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ పిళ్ళై జైళ్ళ పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వ‌హిస్తూ గ‌త సోమ‌వారం రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా జైళ్ళ పోలీస్ హెడ్ క్వార్టర్ లో మంచి వీడ్కోలు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆఫీసు సిబ్బందితో పాటు అధికారులు కూడా హాజరై సుహృద్భావ వాతావరనంలో ఆయనకు వీడ్కోలు ప‌లికారు. అయితే ఈ కార్యక్రమంతా చాలా ఆహ్లాదకరంగా ముగిసింది. అయితే ఉన్న‌ట్టుండి సాయంకాలానికి ఆయ‌న‌కు స‌ర్కారీ నోటీసు వ‌చ్చింది.

తన ఫైల్ ను హోంమంత్రి కార్యాలయానికి పరిశీలన కొరకు పంపుతున్నట్లు అందులో పేర్కొంది. వీలైతే తన సర్వీసును మరో సంవత్సరం పొడిగించనున్నట్లు, తన సేవలను అందించాలని ప్ర‌భుత్వం ఆయనను కోరింది. అయితే ఈ విషయంపై శ‌నివారం లోపు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలో కొత్త డైరెక్టర్ జనరల్ ఏర్పాటుపై రకరకాల చర్చలు ప్ర‌చారంలో ఉన్నాయి.

త‌గిన సినియారిటీ ఉన్న అధికారులు ఒక‌రిద్ద‌రు ఉన్న‌ప్ప‌టికీ వారు ఇత‌ర ముఖ్య‌మైన బాధ్యతల్లో ఉన్నారని, వెంటనే ఎవరినీ నియమించలేని పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటుందని మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏమైనా వీడ్కోలు అందుకొన్నసంజయ్ పిళ్లైకి మాత్రం ఎటూ అర్ధంకాని అయోమయ సంకట పరిస్థితి నెల‌కొన్న‌ది.

Latest News