విధాత: సోషల్ మీడియా ప్రభావం జనాల్లో విపరీతంగా పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచంలో నలుమూలలా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఇట్టే తెలిసిపోతోంది. దీంతో ఓవర్ నైట్‌లోనే ఊహించని విధంగా పాపులర్ అవుతున్నారు. ఇలా పాపులర్ అవ్వడానికి కొందరు అడ్డమైన పనులు చేస్తూ వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా చైనాలో ఓ వ్యక్తి చేయించుకున్న వింత హెయిర్ స్టైల్ నెట్టింట్లో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది. దాన్ని వీక్షించిన వారంతా బిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని ఓ సెలూన్‌లో పని చేసే వ్యక్తి తనతో పాటు పని చేసే మరో వ్యక్తికి కొత్త రకం హెయిర్ స్టైల్‌ను చేస్తానని చెప్పి బోడి గుండు కొట్టాడు. ఆ తరువాత గుండుపై నీలిరంగులో మెరిసే విధంగా గోపురంలా మెరిసే ఎలాక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాడు. దాన్ని కాస్త వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంకేముంది అది కాస్త వైరల్‌గా మారింది. దాన్ని చూసిన వారు పలురకాల కాంమెంట్లు చేస్తున్నారు. ఆధునీకత పేరుతో అర్థం పర్థం లేని ఫ్యాషన్‌కు వెళితే ఇలాగే జరుగుతుందని చురకలు వేస్తున్నారు.