Site icon vidhaatha

CM KCR | మన భూమి బంగారం.. ఇక్కడ ఎకరం భూమి అమ్మితే.. ఆంధ్రాలో వందెకరాలు కొనొచ్చు: CM KCR

CM KCR

విధాత: తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఆంధ్రాకు వెళ్లి వందెకరాలు కొనుగోలు చేయవచ్చని సీఎం కేసీఆర్‌ అన్నారు. సంగారెడ్డిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుప్రతికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో తొమ్మిదేండ్లలో సాధించిన విజయాలను ప్రస్తావించారు.
కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా ముందుకు సాగాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దీవించాలని ప్రజలను కోరారు.

ఈ రాష్ట్రం ఇంత త్వరలో ఇంత బాగైతుందని ఎవరూ ఊహించలేదని కేసీఆర్‌ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారెకరాలు కొనుక్కుందుము.. ఇప్పుడు తెలంగాణలో ఒకరం అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుకుంటున్నరని చెప్పారని గుర్తు చేశారు. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమేనని అన్నారు.

తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లావారిని సమైక్య శక్తులు గందరగోళానికి గురిచేశాయని, తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని అన్నారని చెప్పారు. కానీ, పటాన్‌చెరువులో ఇవాళ ఎకరం భూమి ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతున్నదని ఈ లెక్కన చంద్రబాబు చెప్పినట్టు.. ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చని అన్నారు.

తాను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు

Exit mobile version