VOA | వీవోఏలకు సీఎం రాఖీ పండుగ కానుక.. జీతాలు పెంపు

VOA | 17,608 మందికి లబ్ధి విధాత: రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకు(వీవోఏ)ల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వీరి వేతనాలు నెలకు రూ.8000 కు పెరగనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ వీవోఏలకు లబ్ధి చేకూరనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ.106 కోట్లు […]

  • Publish Date - September 1, 2023 / 01:09 AM IST

VOA |

17,608 మందికి లబ్ధి

విధాత: రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకు(వీవోఏ)ల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వీరి వేతనాలు నెలకు రూ.8000 కు పెరగనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ వీవోఏలకు లబ్ధి చేకూరనున్నది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ.106 కోట్లు ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం పడనున్నది.

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతీ రాథోడ్ లతో కలిసి మహిళా సంఘాల సహాయకులతో మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు.

మహిళా సంఘాల ప్రతినిధులకు ఉత్తర్వుల కాపీని అందజేశారు. వీవోఏలు హర్షాతిరేకాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. మంత్రులకు రాఖీలు కట్టి కృతజ్జతలు తెలియజేశారు.

Latest News