Site icon vidhaatha

Colors Swathi | పాపం.. ‘కలర్స్’ స్వాతి కెరీర్‌ని కిల్ చేసింది ఆమెనా!

Colors Swathi |

కలర్స్ స్వాతి ఈ పేరు చెప్పగానే ఆమె చేసిన ఆర్జే షో టక్కున గుర్తుకువస్తుంది. చలాకీగా నవ్వుతూ, తుళ్ళుతూ ఆమె మాటల గలగలలో కాలం కరిగిపోతుందనేంత చలాకితనం స్వాతి సొంతం. ఆ షో తరువాత కలర్స్ స్వాతిగా మారి సినిమాల్లోకి వచ్చింది.. పాపులర్ అయింది.

తమిళంలో చేసిన ‘అనంతపురం1980’ సినిమాతో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత వెను తిరిగి చూసుకోలేదు స్వాతి. వెంట వెంటనే వస్తున్న అవకాశాలను అంది పుచ్చుకుంది. సురేష్ ప్రొడక్షన్‌లో నాని సరసన చేసిన ‘అష్టాచమ్మా’ కూడా మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంకేముంది ఓవర్ నైట్ స్టార్ అయింది. దానికి తగినట్టే అవకాశాలు కూడా వచ్చి పడ్డాయి.

‘కలవరమాయె మదిలో’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు’, ‘మిరపకాయ్’ ఇలా వరుసగా సినిమాలు చేసుకుపోయింది. ఇవన్నీ పెద్దగా స్వాతికి పేరు తీసుకు రాకపోయినా సినీ ఇండస్ట్రీలో మంచి ఫ్లోలోనే ఉందనే టాక్ మాత్రం తెచ్చిపెట్టాయి. అయితే కెరియర్ పరంగా 2014లో వచ్చిన ‘కార్తికేయ’తో మళ్ళీ టాప్‌లోకి వచ్చింది స్వాతి.

నిఖిల్‌తో చేసిన ‘కార్తికేయ, స్వామి రారా’ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా ఆమె గ్రాఫ్ తారా స్థాయికి చేరింది. అయితే.. కరెక్ట్‌గా కెరియర్ దూసుకుపోతున్న టైంలో వికాస్ వాసు అనే మళయాళీని పెళ్ళి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది స్వాతి. వికాస్ పైలెట్‌గా వర్క్ చేస్తున్నాడు.

అయితే పెళ్ళయ్యాకా ఇక సినిమాలు చేయదనుకునే టైంలో ‘పంచతంత్రం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది స్వాతి. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే.. స్వాతి తన కెరియర్ వేరే లెవల్‍లో ఉన్న టైమ్‌లో ఎదగకుండా అడ్డు పడింది కన్న తల్లేనట. షూటింగ్స్ విషయంలో కలగజేసుకుంటూ కూతురు రొమాంటిక్ సీన్స్ చేస్తుందేమోననే డౌట్‌తో ఓ కంట కనిపెడుతూ ఉండేదట. స్క్రిప్ట్ విషయంలో కూడా కలగజేసుకుని తెగ ఆంక్షలు పెట్టేదట. ఏదైనా తేడా జరిగితే సెట్‌లోనే రచ్చ చేసేదట స్వాతి తల్లి.

ఓ రకంగా తల్లే.. స్వాతి ఎదుగుదలను అడ్డుకుందని.. ఓ టైంలో నిఖిల్‌తో ప్రేమాయణం ఉందనే రూమర్స్ బాగా నమ్మి స్వాతికి సినిమాలు చాలని వెంటనే పెళ్ళి చేసిందనే టాక్ కూడా జోరుగానే వినిపిస్తుంది. ఈ విషయా తెలిసి స్వాతి సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్ళి చేసుకుని స్థిర పడిందని ఆనందించాలో, లేక తల్లి చెప్పుజేతల్లో ఉండిపోయి కెరియర్ ఫినిష్ చేసుకుందని జాలిపడాలో తెలియక ఆమె ఫ్యాన్స్ తెగ బాధ పడుతున్నారట.

పాపం స్వాతి.. పెళ్ళికి ముందు ఉండే చలాకీతనం, చిలిపితనం ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో.. కెరియర్‌లో మంచి టాలెంట్‌తో స్టార్ హీరోయిన్ కావాల్సిన నటి.. పెళ్ళితో కెరియర్‌కి దూరం కావడం కాస్త బాధకలిగించే విషయమే అయినా.. ఆమె పేరు పోకుండా, పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా స్వాతికి పెళ్లి చేసి తల్లి కూడా మంచి పనే చేసిందనే టాక్ కూడా నడుస్తుంది. ఏంటో రెండు రకాల మనుషుల మధ్య బ్రతుకుతున్నాం అందరం.

Exit mobile version