Railway Stations:
విధాత: రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణపై కేంద్ర రైల్వే మంత్రి (Union Minister of Railways of India) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట కన్‌ఫర్మ్ టికెట్ ఉంటేనే రైల్వేస్టేషన్లలోకి ఎంట్రీని అనుమతిస్తారు. 60 ప్రధాన స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయిచింది. శనివారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్త రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన కరీంనగర్ నుండి తిరుపతి రైలు (12762) (ఆది , గురు) , తిరుపతి నుండి కరీంనగర్ (12761)(బుధ,శని) రైలు ప్రస్తుతం వారానికి రెండు సార్లు మాత్రమే నడుస్తుందని.. దీనిని ప్రతిరోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్తర తెలంగాణ నుంఛఙ తిరుపతి వెళ్లే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులు, ప్రయాణికుల సమస్యలు తొలగించేందుకు కరీంనగర్ నుంఛఙ తిరుపతికి నిత్యం రైలు వేయాలని విజ్ఞప్తి చేశారు.
కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. నష్కల్ నుండి హసన్ పర్తి, నష్కల్ నుండి చింతలపల్లి నూతన రైల్వే బైపాస్ లైన్లను ఓ ఆర్ ఆర్ చుట్టూ అలైన్‌మెంట్ చేయాలని కోరారు. కావ్య విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి రైల్వే బైపాస్ లైన్లను ఓ ఆర్ ఆర్ చుట్టూ అలైన్‌మెంట్ చేస్తామని హమీ ఇచ్చారు.