Site icon vidhaatha

Kadiyam Kavya | మార్నింగ్ వాకర్స్‌తో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య , వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, పబ్లిక్ గార్డెన్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. మార్నింగ్ వాక్ లో భాగంగా అక్కడి వాకర్స్ తో ముచ్చటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ,ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ప్రజలతో మమేకమై పనిచేస్తానని డాక్టర్ కడియం కావ్య భరోసా ఇచ్చారు.కొంత సేపు సరదాగా యువతతో కలసి షటిల్ ఆడారు. అనంతరం వాకర్స్ తో కలిసి రాగిజావ సేవించారు.

Exit mobile version