Congress | రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయండి.. DGPని కలిసిన కాంగ్రెస్ నేతలు

Congress విధాత: రీజనల్‌ రింగ్‌ రోడ్‌లో భూములు కోల్పోయిన రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం పార్టీ ప్రతినిధులు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, వీహెచ్‌, కోదండ రెడ్డిల ఆధ్వర్యంలో డీజీపీ అంజనీకుమార్‌ను కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులపై పెట్టిన కేసులు కొట్టేయలని డీజీపీని కాంగ్రెస్ నేతలు కోరారు. రైతులకు బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో […]

  • Publish Date - June 17, 2023 / 01:18 AM IST

Congress

విధాత: రీజనల్‌ రింగ్‌ రోడ్‌లో భూములు కోల్పోయిన రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం పార్టీ ప్రతినిధులు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, వీహెచ్‌, కోదండ రెడ్డిల ఆధ్వర్యంలో డీజీపీ అంజనీకుమార్‌ను కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులపై పెట్టిన కేసులు కొట్టేయలని డీజీపీని కాంగ్రెస్ నేతలు కోరారు. రైతులకు బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో పోలీస్‌ రాజ్యం: మల్లు రవి

రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోలీసు రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు, మంత్రులు వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మేధావులు, విద్యావేత్తలపై, తెలంగాణ ఉద్యమ కారులపై రాజద్రోహం కేసు పెట్టారన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వానికి, నక్సలైట్ల మధ్య అనేక సార్లు శాంతి చర్చలు జరిపారని తెలిపారు. ప్రజా వ్యతిరేకతకు భయపడి రాజద్రోహం కేసులను కేసీఆర్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే రాజద్రోహం కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉపా చట్టం తీసుకురావడం వేరు… కేసులు పెట్టడం వేరన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపా చట్టాన్ని తీసివేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest News