విధాత : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత చారి వర్ధంతిని జరుపుకోనివ్వకుండా పార్టీ కీలక నాయకులు అడ్డుపడుతున్నారని ఆయన తల్లి కాసోజు శంకరమ్మ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం శ్రీకాంత చారి వర్థంతిని నిర్వహించేవారన్నారు. కానీ ఈసారి శ్రీకాంత్ చారి సొంత నియోజకవర్గంలో వర్థంతిని జరుపుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని..అయినప్పటికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ లు తన కొడుకు శ్రీకాంత్ చారి వర్ధంతి నిర్వహించుకోకుండా ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శ్రీకాంత్ చారి వర్ధంతి నిర్వహణ గందరగోళంగా మారిపోయిందని, నాల్గవ తేదీన సమయం ఇచ్చిన మంత్రి ఉత్తమ్ రాలేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన కొడుకు మంటల్లో కాలిపోతే వచ్చిన తెలంగాణలో ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్న వారు శ్రీకాంత్ చారి వర్ధంతిని అడ్డుకోవడం దారుణమన్నారు. దీనిపై తాను సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమకారులైన స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ అమరుడైన శ్రీకాంత చారి వర్ధంతిని ముందుండి నడిపించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారికి ఘోర అవమానం!
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం శ్రీకాంత చారి వర్థంతిని నిర్వహించేవారు.
కానీ ఈసారి శ్రీకాంత్ చారి సొంత నియోజకవర్గంలో వర్థంతిని జరుపుకోనివ్వని కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్.… pic.twitter.com/2Ol2HG8Xnu
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) December 4, 2025
ఇవి కూడా చదవండి :
TPCC Chief Mahesh Kumar Goud : హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితం
Amaravati : అమరావతి రాజధానికి చట్టబద్దత
