అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మంత్రి శ్రీధర్ బాబు స్థానికంగా ఇక్కడ లేని సమయంలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పాలని, నాతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే విజయరామణ రావు ముగ్గురం మంథనికి రెండు గంటల్లో కుయ్ కుయ్ అని వేగంగా వచ్చి..ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అని వ్యాఖ్యానించారు

అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

విధాత : కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మంత్రి శ్రీధర్ బాబు స్థానికంగా ఇక్కడ లేని సమయంలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పాలని, నాతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే విజయరామణ రావు ముగ్గురం మంథనికి రెండు గంటల్లో కుయ్ కుయ్ అని వేగంగా వచ్చి..ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అని వ్యాఖ్యానించారు.

అయితే ఎమ్మెల్యే హోదాలో ఉన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బాధ్యతారహితంగా మాట్లాడారని, ఓ వీధి రౌడీలా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా, చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసిన ఖండనీయం అన్నారు. అయితే మక్కన్ సింగ్ కు పార్టీ కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకున్న క్రమంలో వారికి ధైర్యం చెప్పేందుకే అలా మాట్లాడారని, వాటిని వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు.

 

ఇవి కూడా చదవండి :

బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి..?
ట్రంప్ ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ క్యాంపెయిన్ !