• Telugu News
  • /National

బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి..?

బీహార్ సీఎం పీఠాన్ని తొలిసారి బీజేపీ నేత అధిష్టించబోతున్నారు. బీహార్ నూతన సీఎంగా ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా సమాచారం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్డీఏ సమావేశం తర్వాత ఆయన ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Apr 14, 2026, 3:41 pm IST
Read Time: 4 mins
బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి..?

విధాత : బీహార్ సీఎం పీఠాన్ని తొలిసారి బీజేపీ నేత అధిష్టించబోతున్నారు. బీహార్ నూతన సీఎంగా ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా సమాచారం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్డీఏ సమావేశం తర్వాత ఆయన ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర పరిశీలకుడిగా హాజరవుతారు.

సీఎం పదవికి నితీశ్ రాజీనామా

మరోవైపు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రస్తుతం సీఎం నితీశ్ కుమార్ మంగళవారం జరిగిన  మంత్రివర్గ సమావేశంలో సీఎం పదవికి రాజీనామా చేశారు.  నితీష్ కుమార్ గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాకు ముందు కేబినెట్ సమావేశం నిర్వహించిన నితీష్.. మంత్రి మండలిని రద్దు చేయాలని గవర్నర్ కు సిఫార్సు చేశారు. బిహార్ రాజకీయ చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన నితీష్ రికార్డు సృష్టించారు.

రేపు  సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం

రేపు సామ్రాట్ చౌదరి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.  243 సీట్లున్న బిహార్‌ శాసనసభలో ఎన్డీయేకి 202 మంది సభ్యుల బలం ఉంది. సామ్రాట్‌ చౌదరీ కొత్త సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బలంగా వినిపిస్తోంది. కేంద్ర సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ పేరు కూడా వినవస్తోంది. మరోవైపు.. నీతీశ్‌ తనయుడు నిశాంత్‌ను కొత్త క్యాబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది.

రెండు దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన ఏప్రిల్ 11న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు, ఆయన 2026 మార్చి 30న బీహార్ అసెంబ్లీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నితీష్ మార్చి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి :

, Ponnam Prabhakar| సమ్మె వద్దు..సమస్యల పరిష్కారానికి సిద్దం : మంత్రి పొన్నం
Sun’s Transit into Aries | నేడు మేష రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశి వారికి వాహ‌న గండం..! జ‌ర జాగ్ర‌త్త‌..!!