Sun’s Transit into Aries | నేడు మేష రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశి వారికి వాహన గండం..! జర జాగ్రత్త..!!
Sun's Transit into Aries | ఇవాళ మేష రాశిలోకి సూర్యుడు సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశులకు అదృష్టం కలిసి రానుంది. మరికొన్ని రాశుల వారికి దురదృష్టం కలగనుంది. మరి ముఖ్యంగా ఒక్క రాశి వారికి మాత్రం వాహన గండం ఉంది. సదరు రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.
Sun’s Transit into Aries | ఏప్రిల్ 14వ తేదీన మేష రాశిలోకి సూర్యుడు సంచారం కారణంగా.. ఆయా రాశుల్లో మార్పలు చోటు చేసుకోనున్నాయి. ఈ మూడు రాశుల వారికి చెడు ఫలితాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ మూడింటిలో ఒక రాశి వారికి మాత్రం వాహన గండం ఉంది. మరి ఆ మూడు రాశులేవో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశిలోకి సూర్య సంచారం వల్ల ఈ రాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త పనులు చేపట్టాలనుకునే వారు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం బెటర్. లేదంటే భవిష్యత్‌పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
కన్యా రాశి
కన్యా రాశి వారు కూడా అనేక విపత్కర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే సూర్యుడి సంచారం మూలంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది.
మీన రాశి
సూర్యుడు మేష రాశిలోకి సంచారం చేయడం వలన మీన రాశి వారికి అనారోగ్య , ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈరాశి వారి వాహనగండం ఉంది. కాబట్టివీరు వీలైనంతవరకు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram