Haryana | హర్యానాలో.. కాంగ్రెస్‌ గాలి: న్యూస్‌ ఎరీనా సర్వే వెల్లడి

హర్యానా: హర్యానా (Haryana)లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీ తథ్యమని న్యూస్‌ ఎరీనా సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 57 స్థానాలు, బీజేపీకి 27 స్థానాలు, జేజేపీకి 4 స్థానాలు, ఇతరులకు 5 స్థానాలు వస్తాయని న్యూస్‌ ఎరీనా ట్విట్టరు ద్వారా ప్రకటించింది. బీజేపీతో పొత్తు లేకపోతే జేజేపీ ఇంకా బలహీనపడే అవకాశం ఉందని, ఒకటి రెండు స్థానాలకు పరిమితమైనా ఆశ్చర్యపడవలసిన పనిలేదని సర్వేలో వెల్లడయింది. చౌతాలా నాయకత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని, […]

  • Publish Date - June 14, 2023 / 11:16 AM IST

హర్యానా: హర్యానా (Haryana)లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీ తథ్యమని న్యూస్‌ ఎరీనా సర్వే వెల్లడించింది.

కాంగ్రెస్‌కు 57 స్థానాలు, బీజేపీకి 27 స్థానాలు, జేజేపీకి 4 స్థానాలు, ఇతరులకు 5 స్థానాలు వస్తాయని న్యూస్‌ ఎరీనా ట్విట్టరు ద్వారా ప్రకటించింది.

బీజేపీతో పొత్తు లేకపోతే జేజేపీ ఇంకా బలహీనపడే అవకాశం ఉందని, ఒకటి రెండు స్థానాలకు పరిమితమైనా ఆశ్చర్యపడవలసిన పనిలేదని సర్వేలో వెల్లడయింది.

చౌతాలా నాయకత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని, ఆ పార్టీ ఓట్లు పెరిగినా సీట్లు రెండుకు మించి వచ్చే అవకాశం లేదని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిని మార్చితే బీజేపీ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని కూడా న్యూస్‌ ఎరీనా పేర్కొంది.

Latest News