Congress | కమ్యూనిస్టులకు కాంగ్రెస్ స్నేహ హస్తం.. లెఫ్ట్ నేతలకు ఠాక్రే ఫోన్‌

Congress | సీట్ల పంపకాలపై ప్రాథమిక చర్చలు విధాత: బీఆరెస్ కాలదన్నుకున్న కమ్యూనిస్టులకు కాంగ్రెస్ స్నేహ హస్తం అందించేందుకు సిద్ధమైంది. సీపీఐ, సీపీఎంలతో పొత్తుకు తాము సిద్ధమని, సీట్ల ప్రతిపాదనలు అందించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మణిక్‌రావు ఠాక్రే లెఫ్ట్ నేతలకు ఫోన్ చేసి పొత్తు దిశగా కాంగ్రెస్ వైపు నుండి ముందడుగు వేశారు. సీపీఐ నేతలు కూడా స్పందించి తాము కోరుతున్న సీట్ల విషయమై ప్రాథమికంగా కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్లుగా స్వయంగా ఆ […]

  • Publish Date - August 27, 2023 / 11:33 AM IST

Congress |

సీట్ల పంపకాలపై ప్రాథమిక చర్చలు

విధాత: బీఆరెస్ కాలదన్నుకున్న కమ్యూనిస్టులకు కాంగ్రెస్ స్నేహ హస్తం అందించేందుకు సిద్ధమైంది. సీపీఐ, సీపీఎంలతో పొత్తుకు తాము సిద్ధమని, సీట్ల ప్రతిపాదనలు అందించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మణిక్‌రావు ఠాక్రే లెఫ్ట్ నేతలకు ఫోన్ చేసి పొత్తు దిశగా కాంగ్రెస్ వైపు నుండి ముందడుగు వేశారు. సీపీఐ నేతలు కూడా స్పందించి తాము కోరుతున్న సీట్ల విషయమై ప్రాథమికంగా కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్లుగా స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సైతం వెల్లడించారు.

సీపీఎం నేతలతో కూడా కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారని, ముందుగా సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్ తో పొత్తు విషయమై చర్చించుకుని సీట్ల ప్రతిపాదనలు చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్ధుబాటులో ప్రతిష్టంభన ఏర్పడితే రెండు పార్టీల జాతీయ నేతలు కూడా పొత్తుల ఖరారులో భాగస్వామ్యమం అవుతారన్నారు. కాగా పొత్తులో భాగంగా సీపీఐ కొత్తగూడెం, హుస్నాబాద్‌, బెల్లంపల్లి, వైరా, మునుగోడు స్థానాలను కోరతుంది.

అలాగే సీపీఎం పాలేరు, భద్రాచలం, మధిర, మిర్యాలగూడ, ఇబ్రహీమ్‌పట్నం స్థానాలు కోరనుండగా, వీటిలో మధిర, భద్రాచలంలు కాంగ్రెస్ సిటింగ్ స్థానాలుగా ఉన్నాయి. చెరో రెండు లేదా మూడు సీట్లు కాంగ్రెస్ ఇవ్వవచ్చని తెలుస్తుంది. బెంగాల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, తృణమూల్‌కు వ్యతిరేకంగా లెఫ్ట్‌కు మద్దతునిచ్చిన తీరు ఇండియా కూటమి ఏర్పాటుతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, వామపక్షల బంధాన్ని చాటుతుంది.

మరోవైపు ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశమై బీఆరెస్‌తో పొత్తు తెగిపోయిన నేపధ్యంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కలిసే వచ్చే పార్టీలతో కలసి పనిచేస్తామన్నారు. బీఆరెస్ పొత్తు ధర్మం పాటించ కుండా తమను మోసం బీజేపీకి దగ్గరైందన్నారు. బీజేపీది విషకూటమి అని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకరావాలన్న ప్రధాని మోడీ, అమిత్ షా వ్యూహాలను మునుగోడులో ఆ పార్టీని ఓడించడం ద్వారా అడ్డుకోగలిగామన్నారు.

పొత్తులపై తొందర పడకుండా జాతీయ విధానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. లెఫ్ట్‌తో కాంగ్రెస్ పొత్తు విషయమై ఆ పార్టీ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. ముందుగా సెప్టెంబర్ 1నుండి 7వరకు ధరల పెరుగుదలపై జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలుంటాన్నారు. అలాగే సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ విముక్తికి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటా వార్షికోత్సవాలను సెప్టెంబర్ 10నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు.

Latest News