Nalgonda: మోదీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు: గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ OBC, SC సెల్ నిరసన

విధాత: ప్రధాని మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్ మాట్లాడారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం […]

  • Publish Date - March 29, 2023 / 12:30 PM IST

విధాత: ప్రధాని మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన దీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్ మాట్లాడారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం కక్షపూరితంగానే పార్లమెంట్‌లో అనర్హత వేటు వేశారన్నారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో జీర్ణించుకోలేక పార్లమెంట్ నుంచి బయటకి పంపించే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని అన్నారు.

దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం అన్నారు. ప్రధాని పదవిని కూడా వదులుకొని ప్రజల కోసం పాటుపడుతున్న రాహుల్ గాంధీని చిన్న కేసును సాకుగా తీసుకొని పార్లమెంటులో అనర్హత వేటు వేయడాన్ని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, ప్రజలు వ్యతిరేకిస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రాహుల్ గాంధీ కుటుంబం పదవులు లేకున్నా ప్రజల కోసం పాటు పడుతుందని స్పష్టం చేశారు. రాబోయే రోజులలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పాశం నరేష్ రెడ్డి, సూరెడ్డి సరస్వతి, అల్లి సుభాష్, నాంపల్లి భాగ్య, సింగారపు విజయ్ కుమార్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, చర్లపల్లి గౌతం, మర్రి మదన్, నాంపల్లి నరసింహ ,జంజరాల గిరి, పగిళ్ల రాజు, చిన్నపరెడ్డి జాన్ రెడ్డి, శివ, నరేష్, అజయ్, కొత్తపల్లి మధు, శంకర్, రమేష్, కిరణ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News