తెలంగాణపై మళ్లీ సమైక్యవాదుల కుట్రలు: శాసనమండలి చైర్మన్ గుత్తా

విధాత: సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పరిపాలనలో దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో దూసుకు పోతున్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నల్గొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, ఆ పార్టీ దత్తపుత్రిక షర్మిల తమ పాదయాత్రలతో సీఎం కేసీఆర్ కుటుంబపై దుష్ప్రచారం చేస్తూ వారిని అప్రతిష్ట పాలు చేసే కుట్ర చేస్తున్నారన్నారు. షర్మిల, బండి సంజయ్ ల పాదయాత్రలు, వ్యవహారం, గవర్నర్ వ్యవహారం, […]

  • Publish Date - December 2, 2022 / 07:20 AM IST

విధాత: సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పరిపాలనలో దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో దూసుకు పోతున్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నల్గొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, ఆ పార్టీ దత్తపుత్రిక షర్మిల తమ పాదయాత్రలతో సీఎం కేసీఆర్ కుటుంబపై దుష్ప్రచారం చేస్తూ వారిని అప్రతిష్ట పాలు చేసే కుట్ర చేస్తున్నారన్నారు.

షర్మిల, బండి సంజయ్ ల పాదయాత్రలు, వ్యవహారం, గవర్నర్ వ్యవహారం, ఈడీ, సీబీఐల దాడులు వంటివి అన్ని చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయంగా, మానసికంగా దెబ్బతీసి తెలంగాణపై దురాక్రమణ చేసేందుకు సమైక్యవాదులు ఉమ్మడిగా కుట్ర రాజకీయాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు.

దేశంలో 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ తెలంగాణపై కన్నేసి ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతూ ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేస్తూ రాజకీయంగా కేసీఆర్‌ను ఆ ప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు. బీజేపీకి దత్త పుత్రికగా మారిన షర్మిల గతంలో ఆమె కుటుంబం సాగించిన అవినీతి పాలన చరిత్ర అందరికీ తెలుసన్నారు.

ఆమె కుటుంబ సభ్యులు 16 నెలలు జైలు జీవితం అనుభవించడంతో పాటు ఉన్నతాధికారులను సైతం జైలు జైలు పాలు చేసిన వైనం తెలంగాణ సమాజం మర్చిపోలేదన్నారు. ఆంధ్రలో ముఖం చెల్లక తెలంగాణ సమాజంపై దొంగల దండులా సమైక్యవాదులు దాడి సాగిస్తున్నారన్నారు.

గతంలో బాంబుల మోతలు, భూకబ్జాలు, మతకల్లోహాలతో పాలన సాగించి తెలంగాణ వనరులను దోచుకున్న సమైక్య వాదులు మరోసారి తెలంగాణపై కన్నేశారని, తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు.

కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలతో, సంక్షేమ అభివృద్దిలతో ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే మనకు శ్రీరామరక్షయని రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కు తెలంగాణ అంతా అండగా కొనసాగాలన్నారు.