- ఆయుధాలు, మందుగుండు సామగ్రి సీజ్
- జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఘటన
విధాత: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా బుధాల్‌లోని బెహ్రోట్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. రాష్ట్ర పోలీసులు, 33 రాష్ట్రీయ రైఫిల్స్, 237 బెటాలియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది గాలింపు ఆపరేషన్ చేపట్టి ఇద్దరు ఉగ్రవాద సహచరులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులను ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీర్ (58), ఫరూక్ అహ్మద్ (42)గా గుర్తించారు. వీరికి ఉగ్రవాద కార్యకలాపాలతో క్రియాశీల సంబంధాలు ఉన్నట్టు నిర్ధారించారు. రికవరీ వస్తువుల్లో 1 పిస్టల్, 2 పిస్టల్ మ్యాగజైన్లు, 28 పిస్టల్ బుల్లెట్లు, 2 గ్రెనేడ్లు, 1 బ్యాగ్, 1 యూనిఫాం, 1 ప్లాస్టిక్ బెల్ట్, 1 పాలీషీట్ (టార్పాల్), 1 మోకాలి టోపీ, 7 బ్యాండేజీలు ఇతరాలు ఉన్నాయి.