Sputnik V: స్పుత్నిక్‌ వీ.. వ్యాక్సిన్‌ సృష్టికర్త దారుణ హత్య

Sputnik V vaccine బెల్టుతో గొంతు నులిమి చంపిన దుండగుడు FIA అదుపులో నిందితుడు Sputnik V । కొవిడ్‌కు విరుగుడుగా రష్యా రూపొందించిన ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌ సృష్టికర్తల్లో ఒకరైన ప్రముఖ శాస్త్రవేత్త తన అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురయ్యారు. విధాత: రష్యా రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వీ’ (Russian Covid-19 vaccine Sputnik V) సృష్టిక‌ర్త హత్యకు గురయ్యారు. మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆండ్రే బొటికోవ్‌ (Andrey Botikov) మృతదేహాన్ని గురువారం కనుగొన్నారు. […]

  • Publish Date - March 4, 2023 / 10:46 AM IST

Sputnik V vaccine

  • బెల్టుతో గొంతు నులిమి చంపిన దుండగుడు
  • FIA అదుపులో నిందితుడు

Sputnik V । కొవిడ్‌కు విరుగుడుగా రష్యా రూపొందించిన ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌ సృష్టికర్తల్లో ఒకరైన ప్రముఖ శాస్త్రవేత్త తన అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురయ్యారు.

విధాత: రష్యా రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వీ’ (Russian Covid-19 vaccine Sputnik V) సృష్టిక‌ర్త హత్యకు గురయ్యారు. మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆండ్రే బొటికోవ్‌ (Andrey Botikov) మృతదేహాన్ని గురువారం కనుగొన్నారు. ఒక దుండగుడు ఆయన గొంతుకు బెల్టు బిగించి హత్య చేశాడని రష్యా మీడియాలో శనివారం వార్తలు వచ్చాయి.

బొటికోవ్‌ (47) గమలేయ నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఎకోలజీ అండ్‌ మేథమెటిక్స్‌ (Gamaleya National Research Center for Ecology and Mathematics) లో సీనియర్‌ పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్న వ్యక్తిని బొటికోవ్‌ మృతదేహం లభించిన కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు ఫెడరల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (federal investigative agency) ఒక ప్రకటనలో తెలిపింది.

ఘర్షణలో జరిగిన హత్యే

ఇద్దరి మధ్య వాదోపవాదం జరిగిన సమయంలో 29 ఏళ్ల యువకుడు బొటికోవ్‌ను బెల్టుతో గొంతు నులిమి హత్య చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇది ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో చోటు చేసుకున్న హత్యేనని, వేరే కోణం ఏమీ లేదని అంటున్నారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉన్నదని పోలీసులు అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా ఈ హత్య తానే చేసినట్టు నిందితుడు ఒప్పకొన్నాడని పేర్కొన్నారు.

పుతిన్‌ చేతుల మీదుగా బొటికోవ్‌కు అవార్డు

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో ఆయన చేసిన కృషికిగాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) చేతుల మీదుగా ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ఫర్‌ ది ఫాదర్‌లాండ్‌ అవార్డు (Order of Merit for the Fatherland award)ను బొటికోవ్‌ అందుకున్నారు. ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల బృందంలో బొటికోవ్‌ ఒకరు.