Site icon vidhaatha

Daam Malware | ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. మీ ఫొన్‌లోకి వైరస్‌! సమాచారం తస్కరిస్తున్న మాల్వేర్‌

Daam Malware |

సెల్‌ఫోన్‌ల‌పై ‘దాం’ బాంబు.. సెర్ట్ హెచ్చిరిక‌

విధాత: సెల్‌ఫోన్ వినియోగ‌దారుల‌ను భార‌త కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్‌) హెచ్చ‌రించింది. ‘దాం'(Daam Malware) అనే మాల్వేర్ వైరస్ మొబైల్ ఫోన్ల‌లోకి చొర‌బ‌డి కాల్ రికార్డులు, కాంటాక్ట్ లిస్టు, ఇత‌ర సున్నిత స‌మాచారాన్ని త‌స్క‌రిస్తోంద‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఒక అడ్వైజ‌రీని జారీ చేసింది.

ఈ మాల్వేర్ చాలా శ‌క్తిమంత‌మైన‌ద‌ని, సెల్‌ఫోన్లో యాంటీ వైర‌స్ ఏర్పాటున్నా.. దానిని ఏమారుస్తుంద‌ని తెలిపింది. థ‌ర్డ్ పార్టీ యాప్స్ నుంచి డౌన్‌లోడ్‌లు చేసుకోవ‌డం వ‌ల్ల దాం ఎటాక్ అయ్యే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చరించింది.

Android recording app with 50K installs stole microphone recordings, files

ఎందుకంత ప్ర‌మాద‌క‌రం..

దాం ఫోన్లోకి చొర‌బ‌డిన త‌ర్వాత అది చేయలేని ప‌ని అంటూ ఉండ‌దు. త‌ప్పుడు కాల్స్‌ను చేయ‌డం, కెమేరాను యాక్సెస్ చేసి స‌మాచారాన్ని సేక‌రించ‌డం, మన బ్యాంకు, ఫోన్ పాస్‌వ‌ర్డ్‌ల‌ను మార్చ‌డం, స్క్రీన్ షాట్లు తీయ‌డం, మ‌న ఫైళ్ల‌ను అప్‌లోడ్ చేయ‌డం, డౌన్‌లోడ్ చేయ‌డం ఇలా అన్నీ చేయ‌గ‌ల‌దు. ఒక్క మాట‌లో చెప్పాలంటే మ‌న ఫోన్‌కు య‌జ‌మానిగా అది మారిపోతుంది.

ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

ఎస్ఎంఎస్‌లు, మెయిల్స్ ద్వారా వ‌చ్చే లింక్‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడ‌దు. అలాగే సాధార‌ణంగా కాకుండా వింతగా ఉన్న నంబ‌ర్ల నుంచి ఫోన్లు వ‌స్తే ఎత్త‌కూడ‌దు. నిజ‌మైన బ్యాంకు నుంచి వ‌చ్చే మెసేజ్‌లు నంబ‌ర్ల నుంచి రావు… వారి సంక్షిప్త పేర్ల మీద మెసేజ్‌లు వ‌స్తాయి.. కాబ‌ట్టి వాటిని గుర్తించుకోవాలి అని సెర్ట్ సూచించింది.

Exit mobile version