Site icon vidhaatha

Damodar Reddy | పేట కాంగ్రెస్ టికెట్ నాదే.. గెలుపు నాదే: R. దామోదర్‌రెడ్డి

Damodar Reddy

విధాత: తాను పార్టీ మారుతున్నానంటు సాగుతున్న ప్రచారం అవాస్తవమని అదంతా దుష్ప్రచారమని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్‌. దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తు తనపై రాజకీయ దురుద్ధేశంతో పనికట్టుకుని బీఆరెస్‌తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

దాదాపు నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తి పై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరమన్నారు. దయచేసి ప్రజలు , కార్యకర్తలు ఎవరు ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. పార్టీ మారాలంటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నన్ను సంప్రదించలేదని, నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదన్నారు. నా పుట్టుక కాంగ్రెస్, చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. పార్టీ మార్పు ప్రచార కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నానన్నారు.

సూర్యాపేట నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ నాదే.. గెలుపు నాదేనని ఇందులో ఎలాంటి అనుమానం, గందరగోళం లేదన్నారు. లోకల్ నాన్ లోకల్ అనే ప్రచారం కరెక్టు కాదని, 40 సంవత్సరాలు సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నానన్న సంగతి పార్టీ మిత్రులు గమనించాలన్నారు. ఎవరు పార్టీలో లేనప్పుడు నేనొక్కడినే ఇక్కడ నుండి గెలిచానన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశానని, ఇండిపెండెంట్‌గా గెలిచినా, ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చానన్నారు. గతంలో చంద్రబాబు , టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ వారి పార్టీలోకి రావాలని కోరినా వెళ్లలేదన్నారు. ఇప్పడు కావలసింది ప్రతిపక్ష నాయకుల పార్టీ మార్పు పై దృష్టి పెట్టడం కాదని, వర్షాలతో నష్టపోయిన ప్రజలకి , రైతులకు చేయూత అందించడమన్నారు. నాకు గ్రూపులు లేవని, నాది కాంగ్రెస్ గ్రూపు సోనియా గ్రూపు అని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.

Exit mobile version