విధాత : తెలంగాణ భవన్‌లో బీఆరెస్ చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమం ఎన్నికల సంఘం ఆంక్షల మధ్య సాగింది. దీక్షా దివస్ కార్యక్రమం నిర్వాహణ సమాచారంతో తెలంగాణ భవన్ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం స్క్వాడ్ టీమ్ ఎన్నికల కోడ్ నేపధ్యంలో ఈ కార్యక్రమం చేయరాదంటూ అభ్యంతరం తెలిపింది.
బీఆరెస్ లీగల్ టీమ్‌తో ఎన్నికల అధికారులతో, డీసీపీతో చర్చలు జరిపాక ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోడ్ కారణంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల కూడా వేయకుండా నివాళులర్పించి రక్తదానం చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆరెస్ నాయకులు రక్తదానం చేశారు.