Tamil Nadu | డెలివ‌రీ బోయ్ డైన‌మిక్ స‌క్సెస్

Tamil Nadu పని చేసుకుంటూనే సివిల్స్‌ కొట్టాడు త‌మిళ‌నాడులో ఓ యువకుడి విజయం చెన్నై: తమిళనాడులో ఓ డెలివరీబాయ్‌.. అద్భుతం సాధించాడు. పట్టుదల ఉంటే.. రోజువారీ పని చేసుకుంటూ కూడా రాష్ట్రస్థాయి సివిల్స్‌ సాధించవచ్చని నిరూపించాడు. ఇటీవల తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. సివిల్స్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షకు ప్రిపేర్‌ అయిన విఘ్నేశ్‌ అనే యువకుడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. చదువుకుంటూనే.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని జొమాటో కంపెనీలో డెలివరీ బాయ్‌గా చేరాడు. రోజువారీ […]

  • Publish Date - July 24, 2023 / 11:44 PM IST

Tamil Nadu

  • పని చేసుకుంటూనే సివిల్స్‌ కొట్టాడు
  • త‌మిళ‌నాడులో ఓ యువకుడి విజయం

చెన్నై: తమిళనాడులో ఓ డెలివరీబాయ్‌.. అద్భుతం సాధించాడు. పట్టుదల ఉంటే.. రోజువారీ పని చేసుకుంటూ కూడా రాష్ట్రస్థాయి సివిల్స్‌ సాధించవచ్చని నిరూపించాడు. ఇటీవల తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. సివిల్స్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షకు ప్రిపేర్‌ అయిన విఘ్నేశ్‌ అనే యువకుడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. చదువుకుంటూనే.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని జొమాటో కంపెనీలో డెలివరీ బాయ్‌గా చేరాడు. రోజువారీ ఆర్డర్లు డెలివరీ చేసుకుంటూనే.. చదువుపైనా దృష్టిపెట్టాడు. కోచింగ్‌ సెంటర్లకు వెళ్లే స్థోమత కూడా లేకపోవడంతో పట్టుదలగా చదివాడు.


అడ్డు వచ్చిన కష్టాలను అధిగమించాడు. చివ‌ర‌కు తాను సాధించాల్సిన విజ‌యాన్ని చ‌విచూశాడు. విఘ్నేశ్‌ విజ‌యానికి అతడి కుటుంబం ఉప్పొంగిపోయింది. చ‌దువులు వ్యాపార‌మై.. డొనేష‌న్లు, పేప‌రు లీకేజీలతో నడుస్తున్న రోజుల్లో కష్టపడి పనిచేసుకుంటూనే పట్టుదలతో చదివి పరీక్ష పాస్‌ అయిన విఘ్నేశ్‌కు రాష్ట్రం న‌లు మూల‌ల‌నుండి ప్ర‌శంస‌లు, అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. ఈ సంద‌ర్భంగా జొమాటో యాజ‌మాన్యం కూడా విఘ్నేశ్‌ సాధించిన విజ‌యం ప‌ట్ల‌త‌మ ఆనందాన్ని ఫేస్ బుక్, మైక్రో బ్లాగ్,ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

ప్రేరణగా నిలుస్తున్న విఘ్నేశ్‌

గాలిలో క‌లలు సాకారం కావు. కలలు సాకారం చేసుకోవాలని అనుకునేవారు ఎంతో చమటోడ్చాల్సి వస్తుంది. చదువు పట్ల నిబద్ధత కూడా ఎంతో ముఖ్యం. దీనికి అనేక మంది ప్రేరణగా నిలుస్తున్నారు. ఆ జాబితాలో తాజాగా విఘ్నేశ్‌ కూడా చేరాడు. తమ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రాష్ట్ర స్థాయి సివిల్స్‌ సాధించిన విఘ్నేశ్‌ గురించి జొమాటో తన సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు చేస్తూ.. ‘జొమాటో డెలివరీ పార్టనర్‌గా పనిచేస్తూనే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విఘ్నేశ్‌కి ఒక లైక్ ఇవ్వండి’ అని రాసింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ‘అద్భుతమైన విజయాన్ని సాధించారు’ అంటూ పలువురు ప్రశంసించారు. మరికొందరు ‘కఠోర ఫలం మధురమైన అమృతం కంటే మధురమైనది’ అని ఒక యూజర్‌ రాశారు.

Latest News