Site icon vidhaatha

Desapathi met Harish Rao: కుటుంబ సమేతంగా మంత్రి హరీష్‌రావును కలిసిన దేశపతి

Desapati met Minister Harish Rao

విధాత, మెదక్ బ్యూరో: ఎమ్మెల్సీ(MLC)గా దేశపతి శ్రీనివాస్(Deshpati Srinivas) నామినేషన్(Nomination) దాఖలు చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao)ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు దేశపతి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వివరాలు ఇలా వున్నాయి.

బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి దేశపతి శ్రీనివాస్ గురువారం అసెంబ్లీ ఆవరణలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంత‌రం దేశపతి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా మంత్రి హరీష్ రావుని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దేశపతికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారనీ, సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కవిగా, రచయితగా పేరొందిన ప్రజల కష్ట, సుఖాలు తెలిసిన దేశపతి ఎమ్మెల్సీ అయ్యి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం రావడం గొప్ప విషయం అన్నారు. మంచి మనసున్న దేశపతికి అంతా మంచి జరగాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.

Exit mobile version