Suryapet | ఆగస్టు 6 నుంచి ధర్మార్జున్ ప్రజా ఆశీర్వాద యాత్ర

Suryapet విధాత: తెలంగాణ జాతిపితా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజు ఆగస్టు 6 నుండి సూర్యాపేట నియోజకవర్గంలో తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇంచార్జీ ధర్మార్జున్ నాయకత్వంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించనున్నట్లుగా తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమా శంకర్, జిల్లా అధ్యక్షులు మాండ్రమల్ల యాదవులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో వారు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల […]

  • Publish Date - July 16, 2023 / 11:33 AM IST

Suryapet

విధాత: తెలంగాణ జాతిపితా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజు ఆగస్టు 6 నుండి సూర్యాపేట నియోజకవర్గంలో తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇంచార్జీ ధర్మార్జున్ నాయకత్వంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించనున్నట్లుగా తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమా శంకర్, జిల్లా అధ్యక్షులు మాండ్రమల్ల యాదవులు తెలిపారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో వారు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల వారిగా అన్ని ప్రాంతాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని ఆశించామని కానీ అధికారంలోకి వచ్చిన బీఆరెస్ ప్రజా ప్రతినిధులు అభివృద్ధిని మరచి కాంట్రాక్టులు, కమిషన్లు లక్ష్యంగా పనిచేస్తున్నారని వారి విమర్శించారు.

సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి రెండు మూడు కట్టడాలను చూపిస్తూ మొత్తం నియోజకవర్గ అభివృద్ధిని తానే చేసినట్లుగా భజన కీర్తనలు చేయించుకుంటున్నారని వారి విమర్శించారు. సూర్యాపేట నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కై, అవినీతి లేని ఎన్నికల కోసం, డబ్బులు పంచని రాజకీయాల కోసం ధర్మార్జున్ చేపట్టే ఈ యాత్రను విజయవంతం చేయాలని, ప్రజలు ఆశీర్వదించాలని వారు కోరారు.

ఈ సమావేశంలో యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ కిరణ్ కుమార్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు వినయ్ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకూరి గోపి, జిల్లా నాయకులు బొడ్డు శంకర్, పట్టణ అధ్యక్షుడు బంధన్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు సుమన్ నాయక్, ఆత్మకూరు మండల నాయకులు కొల్లు కృష్ణారెడ్డి, సూర్యాపేట మండల పార్టీ కోఆర్డినేటర్ వలికి గోవర్ధన్, ఎస్టి సెల్ జిల్లా నాయకులు మూడ్ మల్సుర్ దేవత్, సతీష్ ,యువజన సమితి జిల్లా నాయకులు యాకూబ్ రెడ్డి, పట్టణ నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Latest News