DK Aruna | విధాత: హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి తనను ఎమ్మెల్యేగా పరిగణిస్తూ తగు ఆదేశాలివ్వాలని కోరుతు మాజీ మంత్రి డీకె.అరుణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కలిశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ కేసులో ఆయనపై హైకోర్టు అనర్హత వేటు వేసి, అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.
కోర్టు ఉత్తర్వుల కాపీలను అరుణ సీఈవోకు అందించింది. అంతకముందు డీకే అరుణ హైకోర్టు ఉత్తర్వులను అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలకు అందించేందుకు వెళ్లగా వారు లేకపోవడంతో ఉత్తర్వు కాపీలను వారి కార్యాలయంలో అందచేశారు. డీకే అరుణ వెంట పార్టీ ఎమ్మెల్యే రఘనందన్ రావు, ఎమ్మెల్సీ రామచందర్ రావులు ఉన్నారు.